1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By Selvi
Last Updated : సోమవారం, 8 డిశెంబరు 2014 (17:58 IST)

4 సూపర్ పేరెంటింగ్ గోల్స్.. చైల్డ్ కేర్ నిపుణుల సూచనలు!

తల్లిదండ్రులకు ఓపిక, బాధ్యత, తృప్తి, సవాల్ ఉండాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. పిల్లల పట్ల ఓపిక.. వారిపై బాధ్యతగా వ్యవహరించడం తప్పనిసరి. అయితే పక్కింటి పిల్లలతో పోల్చడం ద్వారా తృప్తి చెందకపోవడం మాత్రం పారెంట్స్‌కు ఉండకూడదని వారు అంటున్నారు. ఈ లక్షణాలు గల తల్లిదండ్రులే పిల్లలను ఈ సమాజంలో అత్యున్నత స్థాయిలో నిలబెట్టగలుగుతారు. 
 
వీటితో పాటు ఈ టిప్స్ కూడా పాటించాల్సిందే.. పిల్లలపై ఎప్పటికీ ఒక కన్ను పెట్టాలి. వాళ్లు ఏం చేస్తున్నారనేది ప్రతిసారీ గమనించాలి. పిల్లలతో ఒక ఫ్రెండ్, టీచర్, మదర్, ఫాదర్‌గా ఉండాలి. పిల్లలు తల్లిదండ్రుల్లోనే అందరినీ చూడగలగాలి. సమాజంలోని మంచి చెడులను అప్పటికప్పుడు వారికి అర్థమయ్యే రీతిలో వివరించారు. 
 
సమాజంలో కలిసిపోతూనే.. సమాజంలో ఎలా ప్రవర్తించాలి. సమాజం పట్ల గౌరవం పెంపొందింపజేయాలి. చెడు విషయాలు, పరిస్థితికి అనుగుణంగా మారే అలవాటును, తనను తాను రక్షించుకోగలనన్న ఆత్మ విశ్వాసాన్ని చిన్నప్పటి నుంచే పెంపొందింపజేసుకోవాలి. స్వతంత్ర్యంగా, స్వేచ్ఛగా వదిలిపెట్టి వారికి వెన్నంటి వుంటూ సహకరించాలి. వారి భావాలకు గౌరవమివ్వాలని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు.