టివీతో చిన్నారుల్లో స్థూలకాయం...
ఆటపాటలతో గడపాల్సిన చిన్నారులు కదలకుండా టీవీ చూస్తూ గడిపేందుకు అలవాటు పడితే, అలాంటి వారు స్థూలకాయంతో బాధపడక తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజూ కేవలం గంటసేపు కదలకుండా టీవీ చూసినా, స్థూలకాయం ముప్పు తప్పదని వారు చెబుతున్నారు.

మూడు నుంచి ఐదేళ్ల లోపు వయసు గల చిన్నారులపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు శాండియాగోలోని శిశువైద్య నిపుణులు చెబుతున్నారు. రెండేళ్ల లోపు వయసు గల పిల్లలను అసలు టీవీ చూడనివ్వరాదని, చిన్నారులను రోజుకు రెండు గంటలకు మించి చూడనివ్వరాదని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్‌కు చెందిన నిపుణులు సూచిస్తున్నారు.