ఆదివారం, 5 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. కాంటినెంటల్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (15:59 IST)

కొత్త మ్యాగీ మిల్క్ షేక్.. నెట్టింట వైరల్ (Video)

Maagi Milk Shake
మిల్క్​ షేక్స్​లో చాలా వెరైటీలు వున్నాయి. ప్రస్తుతం నెట్టింట ఓ సూపర్ మిల్క్ షేక్ వైరల్ అవుతోంది. అదేంటంటే... కొత్త మ్యాగీ మిల్క్ షేక్. ఇదేంటి..? మ్యాగీ మిల్క్​షేకా? అని ఆశ్చర్యపోతున్నారా? ఇదేదో జోక్​ అని కొట్టిపారేయకండి. 
 
మ్యాగీ మిల్క్​ షేక్​కి ట్విట్టర్​లో మస్త్​ డిమాండ్​ ఉంది. అవును.. ఈ మ్యాగీ మిల్క్​షేక్​కి సంబంధించిన ఫొటోలు ట్విట్టర్​లో ఫుల్​ ట్రెండ్​ అవుతున్నాయి. 
 
ఈ మిల్క్​ షేక్​ ఎవరు తయారుచేశారో, ఎక్కడ అమ్ముతున్నారో తెలియదు. కానీ, ట్విట్టర్​లో ఈ రెసిపీపై జోకులు మాత్రం టపాసుల్లా పేలుతున్నాయి. ఒక్కొక్కరూ ఒక్కోలా రెస్పాండ్​ అవుతూ ఈ మిల్క్​ షేక్​ తయారుచేసిన వాళ్లని వెతికి పట్టుకోమని ట్విట్టర్​లో​ రిక్వెస్ట్​ చేస్తున్నారు. 
 
ఇక ఈ వంటకంలో వండిన, పసుపు, తడిసిన మ్యాగీతో పొరలుగా ఉండే తెల్లటి క్రీము పాలు. ఆరెంజ్ క్యారెట్ మరియు పచ్చి బఠానీల చిన్న ముక్కలు వున్నాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.