శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 మార్చి 2020 (21:34 IST)

వేడి నీళ్ళతో స్నానం చేస్తే కరోనా వైరస్ చనిపోతుందా? (video)

భారత్‌తో పాటు.. ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ కరోనా వైరస్. ఈ వైరస్ ధాటికి అనేక మంది పిట్టల్లా రాలిపోతున్నారు. లక్షలాది మంది ఈ వైరస్ బారిపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొందరు ఈ వైరస్ బారినపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంటే.. ఈ వైరస్ బారినపడినవారు త్వరగా కోలుకునేందుకు తమకు తోచిన పద్ధతులను అవలంభిస్తున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నుంచి రక్షణ పొందే సలహాలు, సూచనలే తీసుకోవాలి. అపోహలు, అయోమయానికి గురిచేసే వార్తలకు దూరంగా ఉండాలి. 
 
ముఖ్యంగా, చాలా మందికి ఎండలో నిలబడినా, లేక వేడినీళ్ళతో స్నానం చేసినా ఈ వైరస్ చనిపోతుందన్న అపోహతో పాటు.. బాహ్యప్రపంచంలో ప్రచారం ఎక్కువగానే జరుగుతుంది. దీనిపై వైద్యులను సంప్రదిస్తే, నీళ్ళు బాగా తాగడం వల్ల కరోనా వైరస్‌ ఒంట్లో నుంచి పోతుందని అనుకోవడం అపోహే. అలాగే, ఐస్‌ క్రీములు తిన్నంత మాత్రాన వైరస్‌ స్తంభించిపోతుందని అనుకోవడమూ తప్పే!
 
అలాగే, వేడి నీళ్లతో స్నానం చేసినా, అలాగే హ్యాండ్‌ డ్రయ్యర్లు వాడినా వైరస్‌ చనిపోతుందని అనుకోవడం పొరపాటు. అలాగే, ఎండలో నిలబడినంత మాత్రాన వైరస్‌ పోదు. ఒంటి మీద ఆల్కహాల్‌ స్ర్పే చేసుకున్నా, లేదంటే ఆల్కహాల్‌ తాగినా వైరస్‌ చనిపోతుందనుకోవడం అపోహ. ఫ్లూ టీకాలు వేసుకుంటే కొవిడ్‌ 19 వైరస్‌ నుంచి రక్షణ లభిస్తుందనే ప్రచారం అర్థరహితమే.