శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 ఆగస్టు 2021 (10:10 IST)

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం లెక్కల ప్రకారం 25 వేలకు దిగిరాగా.. తాజాగా 35 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 35,178 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. 
 
కొత్తగా 37,169 మంది బాధితులు కోలుకున్నారని తెలిపింది. మరో 440 మంది వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 1.14శాతం ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 3,67,415 యాక్టివ్‌ కేసులున్నాయని, 148 రోజుల తర్వాత కనిష్టానికి చేరుకున్నాయని చెప్పింది.
 
ప్రస్తుతం రికవరీ రేటు 97.52 శాతానికి చేరుకుందని తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,22,85,857కు చేరాయి. ఇందులో మొత్తం 3,14,85,923 మంది కోలుకున్నారు. వైరస్‌ బారినపడి ఇప్పటి వరకు 4,32,519కు మంది ప్రాణాలు కోల్పోయారు.