శనివారం, 25 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 7 సెప్టెంబరు 2019 (13:21 IST)

హేయ్‌ డేవిడ్‌ వార్నర్‌.. నువ్వొక చీటర్.. వావ్ అంటూ నవ్వుతూ..? (video)

దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి వార్నర్, స్మిత్‌లపై ఏడాది నిషేధం విధించడం జరిగింది. యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్టు మొదలుకొని ఇప్పటివరకూ 'చీటర్‌' వేధింపుల బారిన పడుతూనే ఉన్నారు. నాల్గో టెస్టులో భాగంగా శుక్రవారం ఆసీస్‌ జట్టు తన డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి గ్రౌండ్‌లోకి వెళుతున్న సమయంలో ఇంగ్లిష్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ వార్నర్‌పై మరోసారి నోరే పారేసుకున్నారు. 
 
'హేయ్‌ డేవిడ్‌ వార్నర్‌.. నువ్వొక చీటర్‌' అంటూ ఇంగ్లండ్‌ ఫ్యాన్స్ ఎగతాళి చేసే యత్నం చేశారు. దీనికి వెంటనే వెనక్కి తిరిగి చూసిన వార్నర్‌.. తన రెండు చేతుల్ని పైకి ఎత్తి వావ్‌ అంటూ నవ్వుతూ రిప్లై ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
తొలి టెస్టులో ఆసీస్‌ గెలిస్తే, రెండో టెస్టు డ్రాగా ముగిసింది. ఇక మూడో టెస్టును ఇంగ్లండ్‌ సొంతం చేసుకుంది. దాంతో నాలుగో టెస్టులో గెలిచిన జట్టు యాషెస్‌ సిరీస్‌ను గెలిచే అవకాశాలు ఉండటంతో ఇరు జట్లు తమ శక్తిమేర పోరాడే అవకాశం ఉంది.