మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 సెప్టెంబరు 2021 (08:13 IST)

భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 466 ఆలౌట్ - ఇంగ్లండ్ టార్గెట్ 368 రన్స్

ఓవెల్ వేదికగా ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ పటిష్ట స్థితిలో వుంది. ఈ టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 466 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా ఇంగ్లండ్ ముంగిట 368 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. భారత జట్టును రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ, శార్దూల్ ఠాకూర్, రిష‌భ్ పంత్ ఆదుకోవడంతో భారీ స్కోరు సాధ్యమైంది. 
 
ఈ రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శ‌ర్మ‌ 127 ప‌రుగులు చేయ‌గా శార్దూల్ 60 ప‌రుగులు చేసి పెవిలియ‌న్ చేరాడు. రిష‌భ్ పంత్ 50 ప‌రుగులు చేసి ఔట్ అయ్యారు. పుజారా కూడా 61 ప‌రుగులు చేసి భార‌త్‌కు ప‌రుగులు అందించాడు. ఈ సిరీస్‌లో రెండు హాఫ్ సెంచ‌రీలు చేసి రికార్డు సృష్టించాడు. ఉమేశ్ యాద‌వ్ 25 ప‌రుగులు చేసి.. పెవిలియ‌న్ చేర‌డంతో భారత్ అన్ని వికెట్లను కోల్పోయింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 191 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెల్సిందే. 
 
ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ ముంగిట 368 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ ఉంచింది. ఆ తర్వాత భార‌త్ నిర్దేశించిన 368 ప‌రుగుల లక్ష్యాన్ని ఛేదించ‌డం కోసం.. ఇంగ్లండ్ బ‌రిలోకి దిగింది. ఒక ఓవ‌ర్ ముగియ‌గానే.. భార‌త ఆట‌గాళ్లు.. రోహిత్ శ‌ర్మ‌, పుజారాకు గాయాల‌య్యాయి. దీంతో.. వాళ్లు ఫీల్డింగ్ నుంచి త‌ప్పుకున్నారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 32 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. ఓపెనర్లు బర్న్స్ 31, హమీద్ 43 చొప్పున పరుగులు చేశారు. నేడు ఆటకు చివరి రోజు.