బుధవారం, 18 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 నవంబరు 2023 (22:54 IST)

షర్ట్స్ లేకుండా ఎంజాయ్ చేస్తోన్న రాహుల్, అయ్యర్..

KL Rahul
KL Rahul
టీమిండియా మిడిలార్డర్‌కు స్టార్స్‌ కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ షర్ట్స్ లేకుండా ఎంజాయ్ చేస్తున్న ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూసిన ఫ్యాన్న్.. వీళ్లిద్దరూ విశ్రాంతి సమయాన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నారని అంటున్నారు. 
 
టీమిండియా ప్రపంచ కప్‌లో ధీటుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నా.. ఇప్పటికీ టీమిండియా బ్యాటింగ్ విభాగం ఎక్కువగా రోహిత్, కోహ్లీలపైనే ఆధారపడుతోంది. ఈ సీన్ మారాలంటే.. రాహుల్, శ్రేయాస్ కూడా ఈ వరల్డ్ కప్‌లో ఇంకా చక్కగా రాణించాల్సి వుటుంది.
 
వీరిద్దరూ వరల్డ్ కప్‌లో మంచి ఫామ్‌లో వున్నారు. టోర్నీ తొలి మ్యాచులో ఆసీస్ చేతిలో టీమిండియా ఓడిపోయే పరిస్థితిలో నిలిచింది. అలాంటి సమయంలో కోహ్లీతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన కేఎల్ రాహుల్.. జట్టును విజయతీరాలకు చేర్చిన సంగతి తెలిసిందే.