గురువారం, 2 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 సెప్టెంబరు 2021 (17:02 IST)

తండ్రికాబోతున్న టీమిండియా క్రికెటర్ క్రిష్ణప్ప

krishnappa
టీమిండియా క్రికెటర్‌ క్రిష్ణప్ప గౌతం తండ్రికాబోతున్నాడు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. జనవరి, 2022లో బుజ్జాయి రాక.. సరికొత్త ఆరంభాలు'' అని ఈ కర్ణాటక ఆల్‌రౌండర్‌ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈ సందర్భంగా బేబీ బంప్‌తో ఉన్న భార్య అర్చనా సుందర్‌తో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. 
 
కాగా శ్రీలంకతో ఈ ఏడాది జూలైలో జరిగిన వన్డే సిరీస్‌తో గౌతం భారత్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఇక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్‌ 2021 ఐపీఎల్‌- వేలంలో 9 కోట్ల 25 లక్షలు వెచ్చించి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 
 
అయితే, ఇప్పటి వరకు అతడు చెన్నై తరఫున ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. కాగా కోవిడ్‌ కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌ సెకండ్‌ ఫేజ్‌ సెప్టెంబరు 19న ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలు జట్ల ఆటగాళ్లు యూఏఈకి చేరుకున్నారు.