శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : బుధవారం, 25 అక్టోబరు 2023 (11:56 IST)

భర్తను చావబాది... భార్యను అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం.. ఎక్కడ?

gang rape
ఒరిస్సా రాష్ట్రంలో ఓ దారుణ ఘటన జరిగింది. ద్విచక్రవాహనంపై వెళుతున్న భార్యాభర్తలను అడ్డగించిన కొందరు దుండగులు... భర్తపై దాడి చేసి బంధించారు. అతని భార్యను బలవంతంగా అడవిలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం ఈ నెల 21వ తేదీన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఒరిస్సా రాష్ట్రంలోని జాజిపుర్ జిల్లాకు చెందిన ఓ మహిళ చదువుకునేందుకు బారునా ప్రాంతంలో ఉంటున్నారు. ఆమెను తీసుకెళ్లేందుకు జాజుర నుంచి భర్త వచ్చాడు. ఇద్దరూ కలిసి శనివారం సాయంత్రం ద్విచక్రవాహనంపై వెళుతుండగా, ఓ వాగు సమీపంలో వారిని ఐదుగురు దుండగులు అడ్డగించారు. భర్తపై దాడి చేసి.. మొబైల్, బైక్ తాళాలు లాక్కున్నారు. 
 
అతడిని చావగొట్టి.. భార్యను సమీపంలోని అడవిలోకి ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు భూబన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు బాధితురాలిని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, అత్యాచారం రుజువైనట్లు తేలితే.. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని మీడియాకు వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో అత్యాచారం జరిగినట్లు తేలిందన్నారు.