శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జనరల్ నాలెడ్జ్
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 13 అక్టోబరు 2021 (20:55 IST)

కర్పూరంతో లాభాలేంటో తెలుసా? (video)

కర్పూరం నూనెను ఛాతీ, వీపుపై రాస్తే జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. సాధారణ హెయిర్ ఆయిల్ లో  కర్పూరాన్ని కలిపి రాసుకుంటే.. జుట్టు రాలడం తగ్గుతుంది.

పేల సమస్య కూడా తగ్గుతుంది. చర్మ సమస్యలకు కర్పూరం దివ్య ఔషధం. పడుకునే ముందు కొన్ని కర్పూరం చుక్కలను బెడ్, తలదిండుపై వెదజల్లితే చక్కటి నిద్ర పడుతుంది. విక్స్, ఆవిరి దగ్గు సిరప్ లు, బిళ్లల తయారీలోనూ కర్పూరం వాడడం గమనార్హం.

కుంగుబాటును దూరం చేసే 'పసుపు'
యాంటీబయాటిక్ గా పనిచేసే పసుపు.. మనల్ని కుంగుబాటు నుంచి కూడా దూరం చేస్తుందనే విషయాన్ని పరిశోధకులు కనిపెట్టారు.

దీర్ఘకాలికంగా మనసులో ఉన్న బాధ, మానసిక సమస్యలకు దారితీస్తుందని.. అయితే పసుపులో ఉండే పాలీఫినాన్ కుర్కుమిన్ అనే ఔషధం ఈ ప్రమాదం నుంచి బయటపడేస్తుందని తెలిపారు. ఇక పసుపులోని ఇతర ఔషధ గుణాలు కలిసి.. క్యాన్సర్, గుండె జబ్బుల నుంచి మనల్ని రక్షిస్తాయని పరిశోధకులు చెప్పారు.