ఉల్లిపాయ తొక్కతో ప్రయోజనాలున్నాయని తెలుసా?
ఉల్లిపాయ తొక్కలలో దాగి ఉన్న ఆరోగ్య, అందానికి సంబంధించిన ఈ 7 రహస్యాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అవేమిటో తెలుసుకుందాము.
ఉల్లిపాయ తొక్కలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి, ఆ నీటిని వడకట్టి తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
ఉల్లిపాయ తొక్కలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఈ నీటితో చర్మాన్ని శుభ్రం చేసుకుంటే చర్మ అలర్జీలు తొలగిపోతాయి.
జుట్టును మృదువుగా, అందంగా మెరిసేలా చేయాలనుకుంటే, తలస్నానం చేసేముందు జుట్టుకి ఉల్లిపాయ తొక్క నీటిని ఉపయోగించండి.
ఉల్లిపాయ తొక్క రసం కూడా ముఖం మచ్చలను తొలగించడానికి ఉపయోగిస్తారు.
ఉల్లిపాయ తొక్కలను వేడి నీళ్లలో వేసి మరిగించి ఆ నీటిని వడపోసి తాగితే గొంతు నొప్పి నయమవుతుంది.
ఉల్లిపాయ తొక్కలను వేడి నీటిలో వేసి మరిగించి వడపోసిన తర్వాత ఈ నీటిని తాగడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
ఉల్లిపాయ తొక్కలలో విటమిన్ ఎ, సి, ఇ ఉన్నాయి, ఇవి జుట్టు, చర్మం, కళ్ళు, రోగనిరోధక వ్యవస్థకు మేలు చేస్తాయి.
గమనిక: వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ఈ చిట్కాలను ప్రయత్నించండి.