ఆ కాయలు పచ్చివి తింటే ఆరోగ్యానికి హాని... (video)

Bitter Gourd
సిహెచ్| Last Updated: బుధవారం, 27 నవంబరు 2019 (15:32 IST)
ఈమధ్య పచ్చి కూరగాయలను తినడం ఎక్కువైంది. వండితే వాటిలోని పోషకాలు పోతాయని కొంతమంది పచ్చివాటినే పరపర నమిలిస్తున్నారు. ఐతే ఏ కాయలను పచ్చివిగా తినాలి, వేటిని తినకూడదన్నది తెలుసుకోవాలి. క్యారెట్, బీట్‌రూట్, ఉల్లి, కీర, చిన్నపాటి అల్లం తురుము, ధనియాలు, పుదీనా లాంటి వాటిని పచ్చిగా తిన్నా పర్లేదు.

కానీ సొరకాయ, బీరకాయ, కాకర కాయలను వండిమాత్రమే తినాలి. కాకరను పచ్చిగా తినడం హానికరం. అందులో ఔషధ గుణాలలతో పాటు ఆల్కలాయిడ్స్ కూడా ఉంటాయి. అవి మోతాదుకు మించినప్పుడు శరీరానికి హాని కలిగిస్తాయి.

కాబట్టి దాన్ని పచ్చిగా తినడమో చేస్తే దీర్ఘకాలంలో దాని దుష్ర్పరిణామాలు అనుభవించాల్సి వస్తుంది. అందుకే కూరగాయలను, ఆకుకూరలను వండే తినండి. సలాడ్స్‌గా తీసుకోదగ్గ క్యారెట్, బీట్‌రూట్, ఉల్లి, కీర, చిన్నపాటి అల్లం వంటివాటికి మిగతా కూరలను జతచేయకండి. పొన్నగంటికూర కళ్లకు చాలా మంచిది.

దీనిపై మరింత చదవండి :