సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 26 నవంబరు 2019 (22:12 IST)

తీపి మొక్కజొన్న తింటున్నారా? ఇది తెలుసుకోండి

మొక్కజొన్న పొత్తులు వచ్చేశాయి. వీటిలో తీపి మొక్కజొన్నలు కూడా వుంటాయి. స్వీట్‌కార్న్‌లో విటమిన్ బి, సీలతో పాటు మెగ్నీషియమ్, పొటాషియం ఖనిజాలున్నాయి. పసుపురంగులో ఉన్న స్వీట్‌కార్న్‌లో ఎక్కువగా ఉన్న యాంటీఆక్సిడెంట్స్ కళ్లకు ఎంతో మేలు చేస్తాయి. 
 
అరటిపండ్లలో కంటే స్వీట్‌కార్న్‌లో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. అరటిపండ్లలో 15 గ్రాముల చక్కెర ఉండగా, స్వీట్‌కార్న్‌లో 6 నుంచి 8 గ్రాములే ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటంతోపాటు ఎన్నో పోషకాలున్న స్వీట్ కార్న్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు.