శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 31 డిశెంబరు 2020 (13:54 IST)

గోరు చిక్కుడు కాయల్ని ఎవరు తీసుకోకూడదు?

గోరు చిక్కుడు కాయలో ఫైబర్, విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా వున్నాయి. విటమిన్ సి కూడా ఇందులో వుండటంతో వ్యాధినిరోధక శక్తి పెంపొందుతుంది. ఇందులోని ఐరన్ కారణంగా రక్తహీనతను తరిమికొడుతుంది. గోరు చిక్కుడులోని క్యాల్షియం, విటమిన్ ఎలు ఎముకలకు బలాన్నిస్తాయి. ఇమునిటీని పెంచుతాయి. గోరు చిక్కుడు కాయల్లోని ఆక్సిజన్.. ఉదర సంబంధిత రుగ్మతలను దూరం చేస్తుంది. 
 
వాత, పిత్త వ్యాధులను తొలగిస్తుంది. కానీ మందులు తీసుకునే వారు మాత్రం గోరు చిక్కుడు కాయలను తీసుకోకపోవడం మంచిది. ఒక వేళ తీసుకోవాల్సి వస్తే ట్యాబెట్లను వాడటాన్ని ఆ పూట పక్కనబెట్టాల్సి వుంటుంది. ఎందుకంటే ఇది ఔషధాలకు విరుగుడుగా పనిచేస్తుంది. 
 
అందుకే మందులు తీసుకునే వారు గోరు చిక్కుడును వాడకపోవడం మంచిది. గోరు చిక్కుడు వారానికి రెండుసార్లు ఆహారంలో భాగం చేసుకుంటే.. రేచీకటి దరిచేరదు. హృద్రోగ వ్యాధులు నయం అవుతాయి. గోరు చిక్కుడు తీసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో వుంటాయి. అందుకే మధుమేహగ్రస్థులు గోరు చిక్కుడును తీసుకోవడం మేలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.