1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2023 (14:15 IST)

చలికాలంలో సీతాఫలం రోజూ తీసుకోవచ్చా?

అన్ని రకాల పండ్లు వివిధ రకాల పోషకాలతో నిండి ఉంటాయి. ఒక్కో పండులోని పోషకాలను బట్టి మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సీతాఫలం మన శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. సీతాఫలంలో విటమిన్ సి, విటమిన్ బి6, కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది.
 
ఈ ఫలాన్ని ఇంట్లోని పెరట్లో నుంచి పొందవచ్చు. అలా కాకుంటే షాపుల్లో కొనుక్కోవచ్చు. ఈ సీతాఫలం అల్సర్లకు మంచిది: దీర్ఘకాలిక అల్సర్ వ్యాధితో బాధపడేవారు సీతాఫలాన్ని తింటే త్వరగా కోలుకుంటారు. అదేవిధంగా ఎసిడిటీ సమస్య ఉన్నవారు కూడా ఈ పండును తినవచ్చు. సీతాఫలం శరీరంలో జీవక్రియ కార్యకలాపాలను ప్రోత్సహిస్తుంది. మన ఆహారాన్ని శక్తిగా మార్చగల సామర్థ్యం దీనికి ఉంది. 
 
కంటికి, గుండె ఆరోగ్యానికి మంచిది. వీటిని తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి మెరుగ్గా పనిచేస్తుంది. సీతాఫలంలో సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల చర్మాన్ని మృదువుగా ఉంటుంది. 
 
అలాగే శరీర రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో సహాయపడుతుంది. రక్తహీనత ఉన్నవారు,  గర్భధారణ సమయంలో హిమోగ్లోబిన్ లోపం ఉన్న మహిళలు ఈ పండును తీసుకోవచ్చు. శీతాకాలంలో సీతాఫలంను తప్పక తీసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.