ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 16 జులై 2024 (16:00 IST)

రోటీ-అన్నం కలిపి తింటే కలిగే ఆరోగ్య సమస్యలు ఏమిటి?

roti-rice
మధ్యాహ్న భోజనమైనా, రాత్రి భోజనమైనా రోటీ, అన్నం కలిపి తినే అలవాటు కొందరిలో వుంటుంది. ఐతే రోటీ, అన్నం కలిపి తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఆరోగ్యానికి సమస్యలు తెస్తుందని చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము.
 
రోటీ, అన్నం రెండూ వేర్వేరు పోషక లక్షణాలను కలిగి ఉన్నందున వాటిని కలిపి తినరాదు.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక సమయంలో రోటీ లేదా అన్నం ఏదో ఒకటి మాత్రమే తినాలి.
రెండూ కలిపి తింటే ప్రేగులలో కిణ్వ ప్రక్రియ జరుగుతుంది, గ్లైసెమిక్ సూచిక కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
రోటీ, అన్నం కలిపి తింటే లావు పెరిగే అవకాశం ఉంది.
ఈ రెండింటిని కలిపి తింటే శరీరంలో పిండి పదార్ధాలు శోషించబడతాయి, ఇది శరీరానికి మంచిది కాదు.
రెండింటిలోనూ అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు వుండటం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు.
రాత్రిపూట సులభంగా జీర్ణమయ్యే రొట్టెలు తినాలి.
రాత్రిపూట భారీ ఆహారం తీసుకుంటే, మీరు నిద్రపోవడానికి ఇబ్బంది పడవచ్చు