ఏదైనా తిన్న వెంటనే స్నానం చేయవచ్చా?
స్నానం ఆరోగ్యకరంగా కావాలంటే కొన్ని సూత్రాలు పాటించాల్సిందే అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఏదైనా అన్నం తిన్న వెంటనే స్నానం చేయకూడదని వారు సెలవిస్తున్నారు. ఆహారం తీసుకున్న రెండు, మూడు గంటల తర్వాతే స్నానం చేయడం ఆరోగ్యకరం. తలపై మరీ ఎక్కువ వేన్నీళ్లతో స్నానం చేయకూడదు.
స్టీమ్ బాత్, సౌనా బాత్ వంటివి ఆరోగ్యకరం కాదు. బలహీనంగా ఉన్నవాళ్లు, వృద్ధులు మరీ ఎక్కువ చన్నీళ్ల స్నానం కాని, మరీ ఎక్కువ వేడినీళ్లతో స్నానంగాని వద్దు. తప్పనిసరి పరిస్థితుల్లో చన్నీళ్లతో స్నానం చేస్తే.. దానికి ముందు చన్నీళ్లు తాగకూడదు.
గోరువెచ్చని నీళ్లతో స్నానం ముందర కాస్తంత వ్యాయామం మంచిది. కడుపు నిండా తిన్న వెంటనే స్నానం చేయకూడదు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. తిన్న వెంటనే స్నానం అంత మంచిది కాదు. ఆహారం జీర్ణం కావాలంటే కడుపుకు రక్తప్రసరణ అవసరం. అదే స్నానం చేస్తే అది సక్రమంగా జరగదు.
స్నానం చేసేటప్పుడు ఉదరానికి రక్తప్రసరణ సక్రమంగా జరగకుండా శరీరంలోని ఇతరత్రా భాగాలకు రక్త ప్రసరణ జరుగుతుంది. తద్వారా ఆహారం జీర్ణం కాకుండా అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.