గురువారం, 14 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 9 నవంబరు 2018 (11:23 IST)

కిడ్నీల ఆరోగ్యంగా వుండాలంటే..? నిత్యం బార్లీ నీటిని?

బార్లీ గింజలు కిడ్నీలను శుభ్రం చేస్తాయి. నిత్యం బార్లీ నీటిని ఓ గ్లాసుడు తాగుతుంటే కిడ్నీలు శుభ్రం అవుతాయి. ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని గుప్పెడు బార్లీ గింజ‌ల‌ను వేసి బాగా మ‌రిగించాలి. ఆ త‌రువాత వ‌చ్చే నీటిలో నిమ్మ‌కాయ ర‌సం పిండి తాగాలి. ఇలా రోజూ చేస్తే కిడ్నీలు క్లీన్ అవ‌డ‌మే కాదు, మూత్రాశ‌య స‌మ‌స్య‌లు, కిడ్నీలో రాళ్లు కూడా తొలగిపోతాయి. దీంతో కిడ్నీలకు రక్షణ కలుగుతుంది.
 
అలాగే  రోజుకు 8 నుంచి పది గ్లాసుల నీటిని సేవించాలి. కిడ్నీల ఆరోగ్యం కోసం తాజా పండ్లు, కూరగాయలు, ముఖ్యంగా పొటాషియం ఎక్కువగా ఉన్న వాటిని రోజూ తీసుకోవాలి. ద్రాక్ష‌, నారింజ‌, అర‌టి పండ్లు, కివీ, అప్రికాట్ త‌దిత‌రాల్లో పొటాషియం ఎక్కువ‌గా ఉంటుంది. దీంతో ఇవి కిడ్నీల‌ను శుభ్రం చేస్తాయి. 
 
అదేవిధంగా పాలు, పెరుగు, ప‌లు ర‌కాల బెర్రీ పండ్లు కూడా కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా కిడ్నీలు సురక్షితంగా వుండాలంటే.. మద్యానికి దూరంగా వుండాలి. కెఫీన్ ఆహారంలో భాగం కాకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.