రోజంతా ఉల్లాసంగా ఉండాలంటే ఇలా చేయండి...
చాలా మంది ఉదయం నిద్రలేవగానే ఏదో కోల్పోయినట్టుగా దిగాలుగా ఉంటారు. ఏమాత్రం హుషారులేకుండా ఉంటారు. ఫలితంగా రోజంతా లేజీనెస్‌తో ఉంటారు. ఇది మనం చేసే పనులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలా లేకుండా రోజంతా ఉల్లాసంగా ఉండాలంటే ముందుగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది.
* పొద్దున్నే మోగిన అలారం బటన్ నొక్కి, మళ్లీ ముసుగు తన్నే అలవాటు ఉంటే తక్షణం మానుకోవాలి. ఒకసారి మెలకువ వచ్చిన తర్వాత మళ్లీ నిద్రపోవటం మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది.
* నిద్రలేచినా పక్కమీదనే మునగదీసుకుని పడుకోరాదు. ఇలాచేయడం వల్ల ఒత్తిడి పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
* ఎన్ని గంటలు నిద్రపోవాలన్న విషయాన్ని ముందుగా నిర్ధారించుకుని అందుకు తగినట్టుగా పడకపైకి చేరుకోవడం ఉత్తమం.
* నిద్ర లేవగానే గ్రీన్‌టీ తాగటం, వ్యాయామం చేయటం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలి.
* పొద్దున లేవగానే కొంచెం సేపు రిలాక్స్ అవ్వండి.
* నిద్రలేవగానే వాట్సాప్, ఈ-మెయిళ్లు, మెసేజ్‌లు చూటడం వాయిదా వేసుకోండి.
* ఉదయాన్నే పాస్తాలు, బ్రెడ్‌లు, దోసె, ఇడ్లీ వంటి టిఫిన్లు తినటం వల్ల పోషకాలు అందవు. దీనికి బదులు ప్రొటీన్లు, పీచు ఉండే ఆహారాన్ని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను, అదుపు చేస్తుంది. కడుపు నిండిన భావన కూడా కలుగుతుంది. అలా ఉదయం పూట అల్పాహారంలో మంచి పోషకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకంటే మంచింది. ఇలాంటి చిన్నపాటి చిట్కాలు పాటించినట్టయితే రోజంతా హుషారుగా ఉంటుంది.