శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 నవంబరు 2019 (11:58 IST)

మెంతులను రోజూ తీసుకుంటే.. మధుమేహం పరార్

మధుమేహం ఉన్నవారికి మెంతులు దివ్యౌషధంగా పనిచేస్తుంది. మెంతులను తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. మెంతులను పరగడుపునే తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. లివర్ పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్, అసిడిటీ, అల్సర్లు నయమవుతాయి. 
 
మెంతులను రోజూ తినడం వల్ల శరరీంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోతుంది. దీని వల్ల అధిక బరువు తగ్గుతారు. చర్మాన్ని మృదువుగా మార్చే ఔషధ గుణాలు మెంతుల్లో ఉంటాయి. చర్మంపై ఉండే మచ్చలు పోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. నొప్పులు, వాపులు తగ్గుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల చర్మంపై వచ్చే ముడతలు తగ్గుతాయి. దీంతో ఎప్పటికీ యవ్వనంగా కనిపిస్తారని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.