1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 20 జనవరి 2023 (18:54 IST)

జాతీయ బాదముల దినోత్సవం 23 జనవరి 2023, బాదములు తింటే ఎంత ఆరోగ్యమంటే?

Almonds
బాదములను ఏ రకంగా తీసుకోవడానికి అయినా ప్రజలు ఇష్టపడతారు. ప్రపంచవ్యాప్తంగా, ఈ గింజలు ఎక్కువమంది తినడానికి ఇష్టపడే గింజలుగా మారాయి. మన రోజువారీ డైట్‌లో తప్పనిసరి పదార్ధాలుగానూ మారాయి. ఈ గింజలు పలు ఆరోగ్య ప్రయోజనాలను తమతో పాటుగా తీసుకుని వెళ్తాయి. ఈ కారణం చేతనే భారతీయ గృహాలలో వైవిధ్యమైన స్ధానం ఈ బాదములకు ఉంది. భారతదేశంలో, ఉదయం పూట బాదములను తినడం అనేది పురాతన సంప్రదాయంగా వస్తుంది.


వీటిని స్నాక్‌గా తినడం, రెసిపీలలో వినియోగించడంతో పాటుగా చర్మ సంరక్షణను సైతం మెరుగుపరుస్తుంది. తరచుగా వీటిని సాంస్కృతిక సంప్రదాయాలలో భాగంగా చూస్తున్నారు. అత్యంత విలువైన బహుమతిగానూ పరిగణిస్తున్నారు. ప్రతి సంవత్సరం 23 జనవరిన జాతీయ బాదము దినోత్సవం నిర్వహిస్తుంటారు.  తద్వారా ఈ రుచికరమైన గింజలను గుర్తిచడంతో పాటుగా వీటిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి అవగాహన కల్పించనున్నారు.
 
బాదములలో 15అత్యవసర పోషకాలు ఉన్నాయి. వీటిలో విటమిన్‌ ఈ అత్యధికంగా ఉండటంతో పాటుగా డైటరీ ఫైబర్‌ కూడా అధికంగా ఉంటుంది. అదనంగా , బాదములలో మెగ్నీషియం, జింక్‌, ఐరన్‌, కాల్షియం ఉండటంతో పాటుగా ఎన్నో ప్రయోజనాలనూ అందిస్తుంది. వీటిలో అత్యంత అనుకూలమైన ఫ్యాట్‌ ప్రొఫైల్‌ సైతం ఉంది. ఓ సర్వింగ్‌ అంటే సుమారు 30 గ్రాములలో ఒకరు 13 గ్రాముల అన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఉంటాయి. దీనిలో 9 గ్రాముల మోనో శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఉంటాయి. ఈ గింజలలోని పోషకాల కారణంగా ప్రతి రోజూ 23 బాదములు తింటే ఒకరి ఆరోగ్యానికి  అవి ఎంతో  మేలు చేస్తాయి.
 
బాదములను ప్రతి రోజూ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
 
బరువు నియంత్రణ: బాదములలో ఆకలి తీర్చే గుణాలు ఉన్నాయి. అవి భోజనాల నడుమ ఆకలి తీర్చడంలో సహాయపడతాయి
 
మధుమేహ నియంత్రణ : బాదములలో అతి తక్కువ గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ ఉందని పలు అధ్యయనాలు కనుగొన్నాయి. బాదముల కారణంగా బ్లడ్‌ షుగర్‌ ప్రభావం తగ్గడంతో పాటుగా కార్బోహైడ్రేట్‌ ఫుడ్‌ ప్రభావమూ తగ్గిస్తుంది. తద్వారా మధుమేహ రోగులకు సహాయకారిగా ఉంటుంది.
 
చర్మ ఆరోగ్యం:  బాదములలో విటమిన్‌ ఈ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. యాంటీ ఏజింగ్‌ లక్షణాలను ఇది కలిగి ఉంది. బాదములు, ఓ గుప్పెడు ప్రతి రోజూ తీసుకోవడం వల్ల, ముఖంపై మడతలు తగ్గడం, చర్మ సౌందర్యం పెరగడం జరుగుతుంది. పరిశోధనలు వెల్లడించే దాని ప్రకారం ప్రతి రోజూ  బాదములు తినడం వల్ల యువీబీ కాంతిని ఎదుర్కొనే శక్తి చర్మానికి కలుగుతుంది. అదనంగా బాదములతో చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మ కాంతి సైతం పెరుగుతుందరి ఆయుర్వేద, సిద్ధ, యునాని పత్రాలు వెల్లడిస్తున్నాయి.
 
ప్రేగు ఆరోగ్యం: బాదములలో డైటరీ ఫైబర్‌ ఉంది. దీని కారణంగా ఆరోగ్యవంతమైన పెద్దలలో బ్యూటిరేట్‌ కాన్సన్‌ట్రేషన్‌ పెరుగుతుంది. బాదములు తినడం వల్ల పేగులలో మైక్రోబయోమ్‌ డైవర్శిటీ పెరుగుతుంది. అంతేకాకుండా, అత్యంత ప్రమాదకరమైన బ్యాక్టీరియా స్ధాయి తగ్గడానికి సైతం తోడ్పడుతుంది.
 
శారీరక ప్రదర్శన: పరిశోధనలు వెల్లడించే దాని ప్రకారం, వర్కవుట్‌ అనంతర మీల్‌గా బాదం తినడం వల్ల, వ్యాయామాల వల్లకలిగే అలసట గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా అత్యున్నత స్ధాయిలో కాళ్లు, లోయర్‌ బ్యాక్‌ శక్తి కూడా పెరుగుతుంది. అధ్యయనాలు వెల్లడించేదాని ప్రకారం మజిల్‌ డ్యామేజీ కాకుండా  బాదములు సహాయపడతాయి.
 
రక్తపోటు: ఆరోగ్యవంతమైన డైట్‌లో బాదములను భాగంగా చేసుకుంటే డిస్లీపిడెమియా తగ్గించడంలో సహాయపడుతుంది. భారతీయులలో సీవీడీకి అతి ముఖ్యమైన కారణాలో ఇది ఒకటి. అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం, బాదములు అధికంగా తీసుకుంటే రక్త ప్రవాహం తగ్గడంతో పాటుగా రక్త పోటు కూడా తగ్గుతుంది.
 
గుండె ఆరోగ్యం: బాదముల కారణంగా ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. అంతేకాకుండా గుండెకు ప్రమాదకారిగా ఉండే వాపులు సైతం తగ్గుతాయి
 
ఈ సందర్భంగా బాదముల పట్ల అవగాహన కల్పించడం కోసం, ఆల్మండ్‌ బోర్డ్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా నిర్వహిస్తున్న వారం రోజుల కార్యక్రమాలలో ఆరోగ్య నిపుణులు, ఇన్‌ఫ్లూయెన్సర్లు సైతం పాల్గొననున్నారు. నేషనల్‌ ఆల్మండ్‌ డే ప్రచారాన్ని 23 జనవరి 2023న ప్రారంభించనున్నారు. తద్వారా ప్రతి రోజూ 23 గ్రాముల బాదములు తినమని ప్రోత్సహిస్తారు. ఈ ప్రచారాన్ని సుప్రసిద్ధ టీవీ నటుడు రణ్‌విజయ్‌ సింగ ప్రారంభించనున్నారు. అక్కడ ఆయన అత్యంత ఆసక్తి కరమైన ఆల్మండ్‌ డైరీస్‌ను ఇన్‌స్టాగ్రామ్‌పై ప్రకటించనున్నారు.
 
బాదములలోని రోగ నిరోధక శక్తి లక్షణాలు, ఆకలి తీర్చే గుణాలను గురించి షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ, ‘‘బాదములు అత్యంత సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్స్‌. ఆక్సిడేటివ్‌ ఒత్తిడి నుంచి బయటపడటానికి, రోగనిరోధక శక్తి మెరుగుపరుచుకోవడానికి ఇవి తోడ్పడతాయి. ఈ గింజల్లోని ఆకలి తీర్చే గుణాలు కారణంగా అధికంగా రిఫైండ్‌. అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది తోడ్పడుతుంది. అందువల్ల మెరుగైన ఆరోగ్యం కోరుకునేవారు తప్పనిసరిగా తమ డైట్‌లో బాదం జోడించుకోవాలి’’ అని అన్నారు.
 
నేషనల్‌ ఆల్మండ్‌ దినం పుర స్కరించుకుని చర్మ ఆరోగ్య ప్రయోజనాలను గురించి మెడికల్‌ డైరెక్టర్‌ మరియు కాస్మెటాలజిస్ట్‌ డాక్టర్‌ గీతికా మిట్టల్‌ గుప్తా మాట్లాడుతూ, ‘‘బాదములలో అత్యధిక పరిమాణంలో విటమిన్‌ ఈ, పాలీఫీనాల్స్‌ ఉన్నాయి. ఇది చర్మ ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. వీటిని తరచుగా తింటే అవి చర్మ మెరుపుకూ తోడ్పడతాయి. అలాగే అతి ప్రమాదకమైన యువీ బీ కిరణాల నుంచి చర్మం కాపాడుకోవడంలోనూ తోడ్పడుతుంది. ముఖంపై ముడతలు రాకుండటం కోసం ఓ గుప్పెడు బాదములు తీసుకోవడం మంచిది’’ అని అన్నారు.
 
ఫిట్‌నెస్‌ నిపుణురాలు, సెలబ్రిటీ మాస్టర్‌ ఇన్‌స్ట్రక్టర్‌ యాస్మిన్‌ కరాచీవాలా మాట్లాడుతూ, ‘‘బాదములు అత్యంత సహజంగానే వ్యాయామాలకు ముందు మరియు తరువాత తినే స్నాక్స్‌గా నిలుస్తాయి. ఇవి అత్యధిక శక్తిని అందిస్తాయి. వీటిలో ప్రోటీన్‌ అధికంగాఉంటుంది. మజిల్‌ మాస్‌ మెరుగుపరుచుకోవడానికి సైతం తోడ్పడుతుంది. మీ రోజువారీ డైట్‌లో వీటిని భాగం చేసుకోండి’’ అని అన్నారు.
 
సుప్రసిద్ధ భారతీయ సినీ, టీవీ నటి నిషా గణేష్‌ మాట్లాడుతూ ‘‘ఆరోగ్యంగా ఉండాలంటే సమయానికి తినడం అత్యంత కీలకం. కానీ మన రద్దీ జీవనశైలి కారణంగా మనం భోజనాల నడుమ ఎక్కువ సమయం ఇస్తుంటాము. నేను భోజనానికి ఆలస్యం అయితే బాదములపై ఆధారపడతాను. వీటిలో 15 రకాల పోషకాలు ఉన్నాయి. అవి అందించే ప్రయోజనాల కారణంగా నేను వాటిని మా ఫ్యామిలీ డైట్‌లో కూడా భాగం  చేశాను’’ అని అన్నారు.
 
ఆయుర్వేద నిపుణులు డాక్టర్‌ నితికా కోహ్లి మాట్లాడుతూ ‘‘శరీర కణజాలానికి అవసరమైన తేమను బాదములు అందిస్తాయి. ఇవి శక్తిని మెరుగుపరచడం, చర్మం రంగుకు తోడ్పడటం, మజిల్‌ మాస్‌కు సైతం తోడ్పడుతుంది. ఆయుర్వేద సూత్రాలు వెల్లడించే దాని ప్రకారం, బాదములతో ఉబకాయం, ప్రీ డయాబెటీస్‌, మెటబాలిక్‌ సిండ్రోమ్‌ వంటివి నివారించబడతాయి. అంతేకాదు, బాదములను రోజూ తినడం వల్ల శరీర బరువు కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు’’ అని అన్నారు.