సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 ఫిబ్రవరి 2020 (17:54 IST)

అనాస పండుతో అంత ప్రమాదమా? పెయిన్ కిల్లర్స్ వాడేవారు? (Video)

అనాస పండును మితంగా తీసుకుంటే ప్రయోజనకరం. అయితే అనాసపండును అదే పనిగా తీసుకోవడం ద్వారా సైడ్ ఎఫెక్ట్ తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అనాసపండులో పంచదార శాతం ఎక్కువ. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండును అధికంగా తీసుకోకూడదు. ఇది రక్తంలోని ఇన్సులిన్ స్థాయుల్ని పెంచుతుంది.

ఇంకా అనాస పండులో ప్రోమ్‌లైన్ వుంది. ఇది మనం తీసుకునే ట్యాబెట్లతో కలిస్తే కొన్ని ఇబ్బందులకు దారితీస్తుంది. యాంటీ-బయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడుతున్నప్పుడు అనాస పండును తీసుకోకపోవడం మంచిది. 
 
అనాస పండును ఒకటి లేదా రెండు ముక్కలు తీసుకుంటే సరిపోతుంది. జ్యూస్ వేసుకుంటే తాగడం అంత మంచిది కాదు. ఇంకా అనాస పండును తీసుకోవడం ద్వారా దంతాలపై మరకలు ఏర్పడుతాయి. దంతాలపై వుండే ఎనామిల్‌పై ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. 
 
అనాసపండును తీసుకోవడం ద్వారా కొందరికి అలెర్జీ ఏర్పడే అవకాశం వుంది. అందుకే అనాస పండును తినేందుకు ముందు అనాస పండు ముక్కలను కట్ చేసి ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగేయాలి.

కీళ్లవాతం వున్నవారు ఈ పండును తీసుకోకపోవడం మంచిది. అనాస పండులో అత్యధికంగా అసిడిటీ వుంది. దీంతో కొందరిలో కడుపు నొప్పి ఏర్పడే అవకాశం వుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.