చీమ చింతకాయలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
వేసవి రావడంతోటే చీమచింత కాయలు, ముంజకాయలు వచ్చేస్తాయి. ముఖ్యంగా చీమచింతకాయలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వగరు రుచితో కొన్ని తీపి రుచితో కొన్ని వుంటాయి. ఐతే తీపి చీమచింతకాయలు తినాలి. చీమ చింతకాయలు లోపలి గింజలు తినకూడదు. ఈ చీమ చింతకాయలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
చీమ చింతకాయలు తింటే శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తి వస్తుంది.
వీటిలో విటమిన్, ఎ, బి, సిలతో పాటు మెగ్నీషియం, ఐరన్ ఇంకా ఇతర పోషకాలు పుష్కలంగా వుంటాయి.
జ్ఞాపకశక్తిని పెంచి, ఏకాగ్రతను కలిగించే గుణం వీటిలో వున్నాయి.
చీమ చింతకాయలను డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు కూడా తగు మోతాదులో తినవచ్చు.
బరువు తగ్గాలనుకునేవారికి చీమచింతకాయలు మంచి ఆహారం అని చెప్పవచ్చు.
మానసిక ఒత్తిడితో బాధపడేవారికి చీమ చింతకాయలు ఔషధంలా పనిచేస్తాయి.
చీమచింతలో క్యాల్షియం నిల్వలున్న కారణంగా ఎముక బలానికి ఉపయోగపడతాయి.
మోతాదుకి మించి వీటిని తింటే జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు.
గర్భిణీలు, బాలింతలు వీటిని తినకుండా వుండటమే మంచిది.
వగరుగా వుండే చీమచింతకాయలు తింటే గొంతు పట్టుకుంటుంది కనుక వాటిని తినకూడదు.