రోజుకు రెండు స్పూన్ల తేనెను అలా తీసుకుంటే?
తేనె తినడానికి తియ్యగా ఉన్నా అది ఇలా వాడితే మాత్రం ప్రాణానికే ప్రమాదమంటున్నారు ఆరోగ్య నిపుణులు. విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు తేనెలో ఉంటాయి. దీనివల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. తేనెను బాగా వేడిగా ఉండే నీటిలో వేసుకుని ఎట్టిపరిస్థితుల్
తేనె తినడానికి తియ్యగా ఉన్నా అది ఇలా వాడితే మాత్రం ప్రాణానికే ప్రమాదమంటున్నారు ఆరోగ్య నిపుణులు. విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు తేనెలో ఉంటాయి. దీనివల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. తేనెను బాగా వేడిగా ఉండే నీటిలో వేసుకుని ఎట్టిపరిస్థితుల్లో తాగకూడదు. పొరపాటున అలా అతిగా ఉండే వేడి నీటిలో కలిపి తాగితే వికారం, విరేచనాలు, వాంతి అవ్వడం జరుగుతుంది.
తేనెను వేడివేడి ఆహారంలో తీసుకోకూడదు. తేనె మనకు ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం. దానిని మనం మామూలుగా సేవించాలే తప్ప వేడి చేయకూడదు. అలా చేయడం వల్ల అది విషతుల్యంగా మారి మన శరీరానికి ఇబ్బంది కలిగేలా చేస్తుంది. తేనెను ఎప్పుడూ ముళ్లంగి రసంతో కలిపి తీసుకోకూడదు.
వేడి టీ, వేడి కాఫీలలో కలిపి తాగకూడదు. మాంసంతో కలిపి తేనెను తీసుకోకూడదు. నెయ్యిని, తేనెను సమానమైన క్వాంటిటీతో కలిపి తీసుకోకూడదు. అలా చేస్తే విషపదార్థంగా మారుతుంది. తేనెను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. నాణ్యమైన తేనెకు ఎక్స్‌ఫైరీ డేట్ అంటూ ఉండదు.
తేనెను గోరువెచ్చని పాలల్లో గాని, గోరు వెచ్చని నీటిలో గాని కలిపి తీసుకోవాలి. లేదా తేనెను అలాగే డైరెక్ట్‌గా తీసుకున్నా మంచిదే. తేనెను రెండు, మూడు టీ స్పూన్‌ల కంటే ఎక్కువగా తీసుకోకూడదు.