మైగ్రేన్ తలనొప్పి, డయాబెటిస్‌ను తగ్గించే నిమ్మ ఆకులు
నిమ్మఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఆరు నిమ్మ ఆకులను వేడి నీటిలో 15 నిమిషాల పాటు నానబెట్టి ఆ తర్వాత వడకట్టి రెండు నెలలపాటు తీసుకుంటూ ఉంటే నిద్రలేమి గుండె దడ, నరాల సమస్యలు తొలగిపోతాయి.
ఈ ఆకుల రసాన్ని సువాసన ఏజెంట్‌గా ఉపయోగిస్తారు. అంతేగాకుండా మైగ్రేన్ తలనొప్పి ఆస్తమా కూడా తగ్గుతాయి. నిమ్మ ఆకులలో ఉండే సిట్రిక్ యాసిడ్ మూత్రనాళాల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా మూత్రపిండాలలో రాళ్లను నివారిస్తుంది. నిమ్మ ఆకులలో కూడా విటమిన్ సి ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
నిమ్మఆకులో ఉండే ఒక సహజసిద్ధమైన సమ్మేళనం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.