శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 15 నవంబరు 2018 (20:23 IST)

ఇటీవలి కాలంలో పురుషులను వేధిస్తున్న సమస్య ఏంటో తెలుసా?

ఇటీవల కాలంలో పురుషుల్లో చాలామందిని ఎక్కువగా వేధిస్తున్న సమస్య శీఘ్రస్ఖలనం. ఈ సమస్యకు మందులు వాడినా అప్పటికే ప్రయోజనం చేకూరుతుంది కాని పూర్తిగా కాదు. అయితే మనకు ప్రకృతి ఇచ్చిన కొన్ని పదార్థాలను ఉపయోగించి ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అన్నింటి కన్నా ముందు మానసిక ఒత్తిడిని చాలావరకు తగ్గించుకోవాలి. మనసును ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంచుకోవాలి. అయితే ఈ శీఘ్రస్ఖలన సమస్యను తగ్గించే చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. ఒక స్పూన్ అల్లం రసంలో సగం ఉడికించిన కోడిగుడ్డు, కొద్దిగా తేనె కలిపి రోజూ రాత్రి పడుకునే ముందు తీసుకుంటే తీసుకుంటే పురుషుల్లో శీఘ్రస్ఖలనం, తరచుగా అప్రయత్నంగా వీర్యం పోవడం తగ్గి శృంగార సామర్థ్యం పెరుగుతుంది.
 
2. ఒక టీ స్పూన్ క్యారెట్ విత్తనాలను ఒక గ్లాసు ఆవు పాలలో దాదాపు పది నిముషాలు మరిగించి తీసుకుంటే సమస్య తగ్గుతుంది.
 
3. ఒక స్పూన్ ముల్లంగి గింజల్ని ఆవు పాలలో వేసి బాగా కాచి, చల్లార్చి వడకట్టి, ఆ పాలను రాత్రి పడుకునే ముందు తాగుతుంటే సమస్య నుండి బయటపడవచ్చు.
 
4. ఎండిన మామిడి పిందెలను చూర్ణం చేసి నాల్గింతల పంచదార లేదా పటికబెల్లం కలిపి, అరస్పూను వంతున రోజూ రెండు పూటలా నీటితో సేవిస్తుంటే సమస్య తగ్గుతుంది.
 
5. పచ్చ కర్పూరం, జాజికాయ, జాపత్రి చూర్ణాలను సమానంగా కలిపి ఉంచుకుని తగినంత ఎండుద్రాక్ష కలిపి నూరి, సెనగలంత మాత్రలు చేసుకుని రాత్రి పడుకునే ముందు ఒక మాత్ర చొప్పున కప్పు పాలతో సేవిస్తుంటే పురుషుల్లో శీఘ్రస్ఖలనం, స్తంభన సమస్య తగ్గి శృంగార సామర్ద్యం పెరిగి, దాంపత్య సమయంలో సంతృప్తి కలగడమే కాక నీరసం లేకుండా ప్రశాంతమైన నిద్ర పడుతుంది.