మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. భారతీయ
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 20 మే 2020 (15:54 IST)

ఈ కాలంలో ఉసిరి కాయ పచ్చడి తినాల్సిందే, ఎలా చేయాలి?

ఈ కాలంలో ఉసిరికాయలు విరివిగా దొరుకుతాయి. రోజుకో ఉసిరికాయ తీసుకుంటే, ఎన్జరీ అధికంగా ఉంటుంది. అలసట, ఒత్తిడి అనే మాటే ఉండదు. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరుకు చాలా ఉపయోగపడుతాయి. ఇలాంటి ఉసిరికాయతో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు:
ఉసిరికాయలు - 1 కిలో
ఉప్పు - అరకప్పు
పసుపు - చిటికెడు
నువ్వుల నూనె - ముప్పావు కప్పు
కారం పొడి - అరకప్పు
ఇంగువ - 1 స్పూన్
మెంతిపొడి - పావుకప్పు
నిమ్మకాయలు - 4
ఆవాలు - అరస్పూన్.
 
తయారీ విధానం:
ముందుగు ఉసిరికాయలను నీళ్లతో కడిగి ఆరబెట్టాలి. ఇప్పుడు బాణలిలో నువ్వుల నూనె వేసి ఆవాలు, ఇంగువ వేయించి ఉసిరికాయలు వేసి మెత్తబడేవరకూ మూతపెట్టి సన్నని మంటపై ఉంచాలి. పాన్‌లోని ఉసిరికాయలు మెత్తబడిన తర్వాత నీళ్లు ఇంకిపోయేంత వరకు స్టవ్ మీద ఉడికించాలి. కాసేపటి తరువాత దించేలా.. ఇప్పుడు అందులో ఉప్పు, కారం, పసుపు, మెంతిపొడి వేసి నిమ్మరసం పిండి మెుత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మూడురోజుల పాలు జాడీలో నాననివ్వాలి. అంతే... ఉసిరికాయ పచ్చడి రెడీ.