సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 ఏప్రియల్ 2023 (12:34 IST)

డీఆర్ఎస్ అంటే ధోనీ రివ్యూ సిస్టమ్.. మహీపై ప్రశంసలు

singam dhoni
ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా, చెన్నై జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. చెన్నై ఫీల్డింగ్ చేస్తుండగా.. 18వ ఓవర్ వద్ద తుషార్ దేశ్ పాండే బౌలింగ్ చేశాడు. 18వ ఓవర్ మూడో బంతి డేవిడ్ వీస్ ప్యాడ్‌ను తాకింది. దీన్ని అప్పీల్ చేసినా అంఫైర్ చలించలేదు. దీంతో ధోనీ తన చేతి సంకేతాల ద్వారా రివ్యూ కోరాడు. 
 
ఈ రివ్యూలో బాల్ స్టంప్స్‌ను తాకినట్లు తేలింది. దాంతో డేవిస్ వీస్ అవుటైపోయాడు. ఇది జరగడం ఆలస్యం ట్విట్టర్‌లో చెన్నై  జట్టు అభిమానులు పోస్టులతో ధోనీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. డీఆర్ఎస్ అంటే ధోనీ రివ్యూ సిస్టమ్ అంటూ కొత్త భాష్యం చెప్తూ ట్వీట్ చేశారు.