శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (15:26 IST)

పవర్‌బ్యాంకు కొంటున్నారా..?

ఇంటర్నెట్ వాడే వేగానికి ఫోన్ చార్జింగ్ కూడా అంతేవేగంగా అయిపోతుంది. అందుకు ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు. ఇందుకు పరిష్కారం.. పవర్‌బ్యాంకులు. ఒక్కోసారి నకిలీ పవర్‌బ్యాంకులు కూడా అమ్ముతుంటారు. అలాంటివి కొని మోసపోకుండా ఈ చిట్కాలు పాటించండి..
 
1. మీ ఫోల్ బ్యాటరీ సామర్థ్యం 3000 ఎంఏహెచ్ అయితే.. 6000 ఎంఏహెచ్ పవర్‌బ్యాంక్ కొనాలి. 2 యూఎస్‌బీ పిన్నులు జతచేసుకునేది ఉంటే ఇంకా మంచిది. రోడ్డు పక్కన అమ్మే పవర్‌బ్యాంకులు కొంటే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం ఎంతైన ముఖ్యం.
 
2. తక్కువ ధరలో వస్తుంది కదా.. అని తొందరపడి ఏదో ఒకటి కొనకండి.. మంచి సామర్థ్యం ఉన్న పవర్‌బ్యాంకు ధర కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. మార్కెట్లో ఒరిజినల్ బ్రాండ్స్ ఎన్ని ఉన్నాయో.. అంతకంటే ఎక్కువ నకిలీ బ్రాండ్లు కూడా ఉన్నాయి. అందుకే.. ఏదైనా బ్రాండ్ కొనేటప్పుడు పేరు, లోగోను నిశితంగా పరిశీలించాలి.
 
4. ఆన్‌లైన్‌లో కొనడం కంటే.. ఏదైనా మంచి షాపుకు వెళ్లి కొనడం బెటర్. అక్కడైతే చెక్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఎంత ఎక్కువ సామర్థ్యం ఉన్న పవర్‌బ్యాంకు అయితే.. అన్ని ఎక్కువసార్లు మొబైల్‌కి చార్జింగ్ పెట్టుకోవచ్చు. పవర్‌బ్యాంకు కొనేముందు ఫోన్ బ్యాటరీ కెపాసిటీకి సరిపోయేలా కొనాలి.