బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 నవంబరు 2024 (16:37 IST)

చిల్డ్రన్స్ డే: స్పెషల్ స్ట్రాబెర్రీ చీజ్ కేక్ ఎలా చేయాలంటే?

Cheese cake Strawberry
Cheese cake Strawberry
చిల్డ్రన్స్ డేని ఆహ్లాదకరమైన విందులతో జరుపుకోవచ్చు. వారికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ట్రీట్‌గా అందించవచ్చు. చిన్నారులంటే ఇష్టపడే మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజును ప్రపంచ బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 
 
ఈ రోజున పిల్లల్లో పోషకాహారాన్ని నింపే ఆహారాన్ని తయారు చేసి ఇవ్వొచ్చు. స్ట్రాబెర్రీ చీజ్, వెనిలా ఐస్ క్రీమ్‌తో కూడిన చాక్లెట్ కేక్, రెయిన్‌బో చాక్లెట్ ట్రఫుల్ బాల్స్ వంటివి ట్రై చేయొచ్చు. వీటిలో స్ట్రాబెర్రీ చీజ్ కేక్ ఎలా చేయాలో చూద్దాం. 
 
స్ట్రాబెర్రీ చీజ్ కేక్ కోసం కావలసిన పదార్థాలు 
స్ట్రాబెర్రీస్ - పది
కోడి గుడ్లు - ఆరు
బట్టర్ - ఒక కప్పు 
కోకోపౌడర్ - 2 టేబుల్ స్పూన్లు
బేకింగ్ సోడా - అర టేబుల్ స్పూన్
వెనీలా ఎసెన్స్ - ఒక టేబుల్ స్పూన్
పంచదార - రెండు కప్పులు 
మైదా - ఒకటిన్నర కప్పు 
పెరుగు - అరకప్పు 
బేకింగ్ పౌడర్ - 2 టేబుల్ స్పూన్లు 
ఉప్పు - పావు స్పూన్ 
 
తయారీ విధానం: 
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బట్టర్, పంచదార, వెనీలా ఎసెన్స్, బేకింగ్ సోడీ, బేకింగ్ పౌడర్, మైదా, కోకోపౌడర్, గుడ్లు వేయాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా గిలకొట్టాలి.
 
అందులో పెరుగు చేర్చి బాగా మిక్స్ చేయాలి. తర్వాత బేకింగ్ పాన్ తీసుకొని అందులో బట్టర్‌ను అప్లై చేయాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌లో వేసి పాన్ మొత్తం సర్ధాలి. తర్వాత స్ట్రాబెర్రీ ఫ్రూట్ ముక్కలను ఈ మిశ్రమం మీద ప్లేస్ చేయాలి. తర్వాత ప్రెజర్ కుక్కర్లో నీళ్ళు పోసి అరకప్పు ఉప్పు వేయాలి.

తర్వాత ఆ నీటి మీద కేక్ మిశ్రమం ఉంచిన పాన్ లేదా టిన్ ఉంచాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని కనీసం అరగంట పాటు మీడయం మంట మీద ఉడికించుకోవాలి. అంతే స్ట్రాబెర్రీ కేక్ రెడీ.