శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 20 ఏప్రియల్ 2019 (13:55 IST)

ఎప్పుడైనా చెడు పదం వాడితే..?

చిన్నారులు ఏదైనా సులువుగా నేర్చుకోగలుగుతారు. ముఖ్యంగా భావవ్యక్తీకరణ, చక్కని భాషను వాళ్లు అలవరచుకోవాలనుకున్నప్పుడు ఆ ప్రయత్నం ఇంటి నుండే మొదలవ్వాలి. తల్లిదండ్రులే మొదటి గురువులు కావాలి. 
 
పిల్లలకు ఎప్పటికప్పుడు కొత్త పదాలు నేర్పించాలి. కొన్నిసార్లు వారు అర్థం చేసుకోలేకపోవచ్చు. వీలైనంతవరకూ పొట్టి పొట్టి వాక్యాల్లో వివిధ వర్ణనలతో సూటిగా, స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేయాలి. అలానే మీరు చెప్పే సందర్భం, పద ప్రయోగం సరిగ్గా ఉండేట్లు చేసుకోవాలి. ఇలాంటప్పుడు మీరు తప్పనిసరిగా మీ వయసుని దృష్టిలో పెట్టుకోవడం ఎంతైనా ముఖ్యం.
 
పిల్లలు మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు ప్రతిదీ అబ్బురంగానే చూస్తాం.. కాస్త అలవాటు పడ్డాక మాత్రం తప్పొప్పులు చెప్పిస్తాం. ఎప్పుడైనా చెడు పదం వాడితే ఎక్కడ నేర్చుకున్నావు అంటాం. కానీ పిల్లలు ఏం నేర్చుకున్నా మొదట మన ఇంటి నుండే.. అనే విషయం మరచిపోవద్దు. మాట్లాడే భాషలో అన్ని అర్థాలు తెలియకపోవచ్చు. కానీ మాట్లాడే మాటతో పాటు దాన్ని సరైన దిశలో వ్యక్తీకరించడం కూడా అలవాటు చేసుకోవాలి. కోపం, సంతోషం, బాధ.. ఇవన్నీ అర్థమైయ్యేలా చెప్పాలి. 
 
నెలల పిల్లలు కావొచ్చు. వారికి కథలేం అర్థమవుతాయని అనుకోవద్దు. చిన్న కథలను చెబుతూ ఉండాలి. అప్పుడప్పుడూ పుస్తకాల్లోని వివిధ అంశాలను బొమ్మల సాయంతో చూపిస్తూ చెప్పాలి. వారికి తెలియకుండానే ఆసక్తి మొదలవుతుంది. కాస్త మాటలు వస్తోన్న పిల్లలతో ఆయాపాత్రల గురించి, వాటి పనులనూ వివరిస్తూ చెప్పడం వలన కొంతవరకూ ఫలితం ఉంటుంది.