1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2015 (17:57 IST)

పిల్లలకు డిన్నర్ ఏ టైమ్‌కి పెడుతున్నారు..?

ప్రతి రోజు వారు పడుకోవటానికి ఒక నిర్దిష్ట సమయం ఉండాలనేది చాలా కీలకమైన చిట్కా అని చెప్పవచ్చు. నిద్ర అనేది వారి రోజు వారి కార్యక్రమాలలో ఒక భాగంగా ఉండాలి. పిల్లలు పడుకోవటానికి ముందు డిన్నర్‌కు అనుమతించవద్దు. దీని వలన రాత్రి పూట ఎక్కువ సార్లు మేల్కొవటం జరుగుతుంది. రాత్రి పడుకొనే ముందు ఆహారం ఇవ్వటం వలన వారికీ నిద్ర కూడా దూరం అవుతుంది. కాబట్టి మీ పిల్లలకు మంచి ఆహారాన్ని పడుకోవటానికి ఒక గంట ముందు పెట్టాలని గుర్తుంచుకోండి.  
 
పసిబిడ్డలు నిద్రవేళకు ముందు ఒక వెచ్చని స్నానం చేయించుట వలన మంచి నిద్రకు సహాయం చేస్తుంది. ఒక వెచ్చని స్నానం చేయుట వలన ఒక మంచి నిద్ర కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. పిల్లలు పడుకోవటానికి ముందు వారి ముఖం కడగటం, నాపి మార్చటం, బ్రష్ చేయటం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పరిచయం చేయాలి. నిద్రవేళ చిట్కాలు పిల్లాడిని మంచి నిద్రవేళ అమలు కోసం ఆరోగ్యకరమైన పద్ధతులు చాలా ప్రాముఖ్యతను ఇస్తాయి.
 
పిల్లలు సులభంగా నిద్రపోవటానికి నిద్రవేళలో రొటీన్ గా కధ చెప్పటం అవసరం. ఇటువంటి నిద్రవేళ చిట్కాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎందుకంటే పారెంట్స్ పక్కనున్నారనే ధ్వని వారు పడుకోవటానికి మరింత సౌకర్యవంతం చేస్తుంది.