గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కవితలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 26 మార్చి 2022 (23:42 IST)

అలా బంధనాల్లో చిక్కుకుని వున్న ప్రాణికి ముక్తి అనేది యెలా సాధ్యం?

మాయను చెరసాల మనసను గొలుసౌను
భేదమనెడు బొండ బెరసి యుండు
యిట్టి బద్ధజీవి కెన్నడు మోక్షంబు
విశ్వదాభిరామ వినురవేమ
 
మాయ అనేది జైలు. మనసు అనేది సంకెళ్లు. భేదభావం అనేది ఒక బండ అయి వుండగా అలా బంధనాల్లో చిక్కుకుని వున్న ప్రాణికి ముక్తి అనేది యెలా సాధ్యం?

 
ఎరుక కన్నము సుఖమే లోకమున లేదు
యెరుక నెరగ నెవని కెరుకలేదు
యెరుక సాటి యెరుక యెరుకయే తత్త్వంబు
విశ్వదాభిరామ వినురవేమ
 
తెలివిని మించిన సుఖం ఈ లోకంలో యింకేదీ లేదు. తెలివిని తెలుసుకోవడం తెలివికి సాటి తెలివే. తెలివే తత్త్వం.