సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. మహాశివరాత్రి
Written By సిహెచ్
Last Updated : సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (21:49 IST)

రుద్రభూమి గోకర్ణం, ఎందుకని?

బ్రహ్మదేవుడు సృష్టి తన ఇష్టప్రకారం జరగలేదని రుద్రుడు చాలా ఆగ్రహుడయ్యాడు. ఆ సృష్టిని నాశనం చేయడానికి నిశ్చయించుకున్నాడు. ప్రమధ గణాలను సృష్టించాడు. ఈ విషయం తెలుసుకున్న మహావిష్ణువు రుద్రుడు చెంతకు వచ్చాడు.

 
 ఇలా అన్నాడు విష్ణుమూర్తి... రుద్రుడా.. బ్రహ్మ చేసిన అపరాధం క్షమించు. బ్రహ్మ చేసిన ఈ సృష్టిని నీవు ప్రళయ కాలంలో నాశనం చేయి. నీవు సంహారము చేయాలి అని సంకల్పము చేసిన ఈ స్థలనం రుద్రభూమి అని ప్రసిద్ధి గాంచుతుంది. ప్రజలకు ముక్తినిచ్చే స్థలమై, నీవు ప్రజలకు తెలియకుండా గోప్యముగా ఇక్కడే నివశించు'' అని చెప్పాడు.

 
అందుకే ఈ గోకర్ణ క్షేత్రంలో ప్రత్యేకించి ఓ చోట ఇప్పటికీ శ్మశాన భూమిగా గోచరిస్తుంది. పూర్వజన్మ ఫలము వల్ల మృతి చెంది ఈ స్థలంలో దహనము చేయబడి, భగవంతుడని సాయుజ్యం పొందుతారని చెప్పేందుకు శాస్త్ర ఆధారం వుంది.

 
ఈ స్థలం మహత్మ్యం దేవతలు కూడా కొనియాడి తమకు ఈ స్థలములో దహనం చేసే భాగ్యము కలిగినట్లయితే పరమ పావనమవుతుందని ఆశించారు. ఈ విధంగా ఈ స్థల ప్రభావం తెలుస్తుంది.