శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 జనవరి 2023 (15:41 IST)

హిమాచల్ ప్రదేశ్‌లో కలుషిత నీరు తాగి 535 మందికి అస్వస్థత

tap water
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని హహీర్పూర్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కలుషిత నీరు సేవించి 535 మందికి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఈ జిల్లాలోని అనేక గ్రామాలకు జల్ శక్తి మిషన్ కింద నీటిని పంపిణీ చేస్తున్నారు. ఈ నీరు విషపూరితమయ్యాయి. వీటిని సేవించిన అనేక మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ప్రతి ఇంట్లో కనీసం ఇద్దరు వ్యక్తులు అస్వస్థతకు లోనయ్యారు. 
 
నీళ్ళలో పెద్దమొత్తంలో బ్యాక్టీరియా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ కారణంగానే అనారోగ్యం పాలయ్యారని రంగ్‌గాస్ పంచాయతీ హెడ్ రాజీవ్ కుమార్ తెలిపారు. అయితే, నిర్మాణంలో ఉన్న ట్యాంకులో నిల్వ ఉంచిన నీటిని శుద్ధి చేయకుండా పంపిణీ చేసారని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే, అస్వస్థతకు గురైన వారంతా ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖుకు సొంత నియోజకవర్గమైన నౌదాన్‌కు చెందినవారే కావడం గమనార్హం.