శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 ఆగస్టు 2023 (21:07 IST)

విజయవంతంగా చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్-3.. ఇస్రో ప్రకటన

Chandrayaan-3
Chandrayaan-3
చంద్రయాన్ 3 అంతరిక్ష నౌక ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుండి జూలై 14న అంతరిక్షానికి  బయలుదేరింది. ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 అంతరిక్ష నౌక భూమి కక్ష్య నుండి చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. అంతరిక్ష నౌక భూమి చుట్టూ తిరుగుతూ చంద్రుని చుట్టూ తిరగడం ప్రారంభించింది. యాన్-3 ప్రోబ్ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించినట్లు ఇస్రో ప్రకటించింది.
 
సరిగ్గా శనివారం రాత్రి గం.7.15 సమయానికి చంద్రుడి కక్ష్యలోకి వెళ్లింది. చంద్రయాన్ 3 ఆగస్టు 23న చంద్రుడిపైకి దిగుతుందని అంచనా. చంద్రయాన్-3 కార్యకలాపాలను ఇస్రో శాస్త్రవేత్తలు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆగస్ట్ 23 లేదా 24న దక్షిణ ధృవంపై ల్యాండ్ కానుంది.