శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 జూన్ 2023 (16:19 IST)

పెళ్లిలో డ్యాన్స్ చేసిన భార్య.. కొట్టి చంపిన భర్త.. ఎక్కడ?

marriage
పెళ్లిలో డ్యాన్స్ చేసిన భార్యను కొట్టిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బైగపడ గ్రామానికి చెందిన రామచంద్ర సింగ్ (35). ఇతని భార్య షర్మిలా సింగ్ (30). నిన్నగాక మొన్న పొరుగింటి పెళ్లికి జంటగా వెళ్లారు. 
 
వివాహానికి హాజరైన బంధువులు, స్నేహితులు డ్యాన్స్‌లు చేసి సంతోషంగా జరుపుకున్నారు. వారితో పాటు షర్మిల కూడా డ్యాన్స్ చేసింది. ఇది రామచంద్ర సింగ్‌కు నచ్చలేదు. దీంతో అతనికి కోపం వచ్చింది ఆ తర్వాత పెళ్లి ముగియడంతో ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు. పెళ్లి ఇంట్లో ఎందుకు డ్యాన్స్ చేశావని రామచంద్ర సింగ్ భార్యను అడిగాడు.
 
ఇందులో ఇద్దరి మధ్య వాగ్వాదం ముగియడంతో రామచంద్ర సింగ్ భార్య షర్మిలపై దాడి చేశాడు. ఈ దాడిలో షర్మిల అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని షర్మిల మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రామచంద్రసింగ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.