బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 29 అక్టోబరు 2017 (15:42 IST)

ప్రధాని మన్మోహన్ సింగ్‌ను పన్నీర్ సెల్వం కలిసొచ్చారట... తమిళనాడు మంత్రి వ్యాఖ్య

ఓ తమిళ మంత్రి తెలివితేటలు బయటపడ్డాయి. దిండుగల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైనాయి. తమిళనాడు మాజీ సీఎం అయిన పన్నీర్ సెల్వం ఢిల్లీకి వెళ్లి ప్రధాని మన

ఓ తమిళ మంత్రి తెలివితేటలు బయటపడ్డాయి. దిండుగల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైనాయి.  తమిళనాడు మాజీ సీఎం అయిన పన్నీర్ సెల్వం ఢిల్లీకి వెళ్లి ప్రధాని మన్మోహన్ సింగ్‌తో చర్చించి వచ్చారని మాట్లాడుతూ.. అందరూ గొల్లున నవ్వుకునేలా చేశారు. 
 
తమిళ రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ఢిల్లీకి వెళ్లిన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో చర్చలు జరిపి వచ్చారని ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ అనే చెప్పేందుకు బదులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరును చెప్పడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 
 
ఈ నెల 12న పన్నీర్ కొందరు మంత్రులు, అన్నాడీఎంకే నేతలతో కలిసి ఢిల్లీకి వెళ్లి మోదీని కలిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అంటువ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, రోడ్ల విస్తరణ, డెంగ్యూ జ్వరానికి సంబంధించిన చర్యలపై చర్చించినట్లు చెప్తూ వచ్చిన శ్రీనివాసన్ ప్రధాని పేరును మార్చేయడం నెటిజన్లకు సరైన మేత దొరికినట్లైంది.