గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (16:21 IST)

కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చిన ప్రశాంత్ కిషోర్.. ఏంటది?

prashanth kishore
జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి గట్టి షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదంటూ స్పష్టం చేశారు. వచ్చే 2024లో జరిగే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. ఇందుకోసం ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలను తీసుకుంటుంది. 
 
అదేసమయంలో ప్రశాంత్ కిషోర్‌ను పార్టీలో చేరాల్సిందిగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వయంగా ఆహ్వానించారని, అందువల్ల ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలకు ఊతమిచ్చేలా కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో ప్రశాంత్ కిషోర్ వరుస భేటీలు నిర్వహించారు. దీంతో ఆయన పార్టీలో చేరడం ఖాయమంటూ వార్తలు వచ్చాయి.
 
ఈ నేపథ్యంలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదంటూ పీకే స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రశాంత్ కిషోర్ తిరస్కరించారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా వెల్లడించారు. నిర్ధిష్టమైన బాధ్యతలతో పార్టీ చేరాలని స్వయంగా సోనియా ప్రతిపాదించినప్పటికీ అందుకు ప్రశాంత్ కిషోర్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారని చెప్పారు.