శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 17 డిశెంబరు 2018 (14:51 IST)

సిక్కుల ఊచకోత నిజమే : సజ్జన్‌ కుమార్‌కు జీవితఖైదు

సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్ కుమార్‌కు జీవిత కారాగారశిక్ష విధించింది. ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు కొద్దిసేపటి క్రితం న్యాయమూర్తి తీర్పిస్తూ సజ్జన్‌కు జీవితఖైదు విధిస్తున్నట్టు తీర్పునిచ్చారు. దీంతో డిసెంబర్ 31వ తేదీలోగా సజ్జన్ కుమార్ కోర్టులో లొంగిపోవాలని న్యాయమూర్తి ఆదేశించారు.
 
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యోదంతం తర్వాత దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో పలువురు సిక్కు సామాజిక వర్గంపై తీవ్రమైన దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పలువురు సిక్కు వర్గం వారిని దారుణంగా హతమార్చారు. ఈ 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లలో నిందితుడుగా ఉన్న కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ పాటియాల కోర్టు దోషిగా నిర్ధారించింది. 'ఎన్ని సవాళ్లు ఎదురైనా సత్యమే నిలుస్తుందని చెప్పడం ద్వారా బాధితులకు నమ్మకం కల్పించడం చాలా అవసరం' అని సందర్భంగా కోర్టు అభిప్రాయపడింది.