గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 జూన్ 2023 (22:14 IST)

ఒడిశా రైలు ప్రమాదానికి కారకులైన వారికి తగిన శిక్ష.. ప్రధాని

Modi
Modi
ఒడిశా రైలు ప్రమాదానికి కారకులైన వారికి తగిన శిక్ష పడుతుందని ప్రధాని మోదీ అన్నారు. కోల్‌కతాలోని షాలిమార్-చెన్నై సెంట్రల్ మధ్య నడుస్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు శుక్రవారం (జూన్ 2) ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో చెన్నైకి చేరుకునే సమయంలో పట్టాలు తప్పింది. ఈ రైలు పట్టాలు తప్పి మరో ట్రాక్‌పై పడిన తర్వాత బెంగళూరు నుంచి కోల్‌కతా రైలు పట్టాలు తప్పి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది.
 
ఈ ఘోర ప్రమాదంపై పలువురు ప్రపంచ నేతలు, రాజకీయ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రైలు ప్రమాద స్థలాన్ని సందర్శించేందుకు ప్రధాని మోదీ ఒడిశా చేరుకున్నారు. భువనేశ్వర్ ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో ప్రమాద స్థలికి చేరుకుని ప్రమాద స్థలికి వెళ్లి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి క్షతగాత్రులను పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
 
ఆపై ప్రధాని మోదీ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ.. రైలు ప్రమాదంలో ఇంతమంది చనిపోవడం చాలా బాధాకరం. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుంది. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతామన్నారు. 
 
ప్రమాదానికి కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాద స్థలంలో రైల్వే ట్రాక్‌లను బాగు చేసే పనిలో రైల్వే శాఖ నిమగ్నమై ఉందని ప్రధాని తెలిపారు.