మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By శ్రీ
Last Updated : శుక్రవారం, 13 డిశెంబరు 2019 (19:52 IST)

అమెరికాలో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గుమ్మడికాయల ద్వారాకనాథ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. అమెజాన్ కంపెనీలో సాఫ్ట్వేర్‌గా పనిచేస్తున్న ద్వారాకనాథ రెడ్డి స్వస్థలం చిత్తూరు జిల్లా కురబలకోట మండలం మట్లివారిపల్లి. ద్వారాకనాథ రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే అతడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే దానిపై స్పష్టత లేదు. 
 
కాగా ద్వారాకనాథ రెడ్డికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కానీ, వివాదాలు కానీ లేవని బంధువులు చెబుతున్నారు. అతడి బలవన్మరణంతో స్వస్థలంలో విషాదం నెలకొంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇతను భారత కాలమాన ప్రకారం నిన్న మధ్యాహ్నం సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.