శనివారం, 25 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (08:54 IST)

మంగళవారం (10-04-2018) దినఫలాలు ... మీరు దేనిని నమ్ముతారో ఆ విషయమై...

మేషం: ఆర్థిక వ్యవహారాల్లో కొంత పురోగతి సాధిస్తారు. కోర్టు, ఆస్తి వివాదాలు తేలక నిరుత్సాహం చెందుతారు. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. వృత్తి, ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. లిటిగేషన్ వ్య

మేషం: ఆర్థిక వ్యవహారాల్లో కొంత పురోగతి సాధిస్తారు. కోర్టు, ఆస్తి వివాదాలు తేలక నిరుత్సాహం చెందుతారు. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. వృత్తి, ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. లిటిగేషన్ వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహా పాటించడం ఉత్తమం. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
వృషభం: ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు భిన్నంగా ఉంటాయి. చేస్తున్న పనిపై ఆ శక్తి తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగయత్నంలో బిడియం, భేషజం తగదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. వైద్య, న్యాయ రంగాల వారికి ఏకాగ్రత చాలా అవసరం. మీరు అనుకున్న కాంట్రాక్టులు చేతికి అందుతుంది. 
 
మిథునం: సోదరీ సోదరుల మధ్య ఆస్తి పంపకాల ప్రస్తావన వస్తుంది. ముఖ్యమైన పత్రాలు, నోటీసులు అందుకుంటారు. రాబడికి తగ్గట్టుగా ఖర్చులు రూపొందించుకుంటారు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు.
 
కర్కాటకం: ఆర్థిక, కుటుంబ సమస్యలు చికాకుపరుస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. షాపుల స్థలమార్పిడి, వాస్తుదోష నివారణవల్ల మంచి ఫలితాలుంటాయి. వ్యాపారాల అభివృద్ధికి స్థల మార్పు, వాస్తుదోష నివారణ అనుకూలిస్తాయి. స్థిరాస్తి వాదనలు పరిష్కార నడుస్తాయి. ఉన్నత విద్యకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
సింహం: ఊహించని సంఘటనలు సైతం ఎదుర్కొనేందుకు సంసిద్ధులై వుండండి. విద్యుత్ రంగంలో వారు మాటపడక తప్పదు. దూర ప్రయాణాల్లో పరిచయాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వాయిదాలకు హాజరవుతారు.
 
కన్య: ప్రముఖులను కలుసుకుని సంప్రదింపులు జరుపుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. తరచు, సభ, సమావేశాల్లో పాల్గొంటారు. సంఘంలో పేరు, ప్రఖ్యాతలు గడిస్తారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధువుల రాకవలన ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
తుల: రుణాలు, చేబదుళ్లు ఇచ్చే విషయంలో జాగ్రత్త అవసరం. స్త్రీ మూలకంగా వివాదాలు ఎదుర్కొంటారు. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. మీ సంతానం కదలికలను గమనిస్తూ వుండాలి. ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతారు.
 
వృశ్చికం: ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోని వారికి పనిభారం పెరుగుతుంది. మీ పొరపాట్లను సరిదిద్దుకుని ముందుకు సాగండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం లభిస్తుంది. మీ సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఖర్చులు అధికమవుతాయి.
 
ధనస్సు: మీ ఆలోచనా విధానాన్ని ఏ మాత్రం మార్చుకోవద్దు. చిన్నారులకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. పండ్ల, పూల, కొబ్బరి, కూరగాయ, చల్లని పానీయ, చిరు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. గృహోపకరణ వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు.
 
మకరం: వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఊహించని అవకాశాలు వస్తాయి. కొన్ని అనుకూల పరిస్థితులు ఎదురవుతాయి. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. బంధువులతో రాక గృహంలో సందడి కానవస్తుంది. యత్నాలు విరమించుకోవద్దు. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి కలిసిరాగలదు.
 
కుంభం: ఆర్థిక సమస్యలు తలెత్తడం వల్ల ఆందోళన చెందుతారు. శ్రమ ఎక్కువైనట్లు అనిపిస్తే వెంటనే పని నుంచి విశ్రాంతి తీసుకోండి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. రాజకీయాల్లోని వారికి ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. నిరుద్యోగులకు సమాచార లోపం వల్ల ఒక అవకాశం చేజారిపోతుంది. 
 
మీనం: భవిష్యత్ ప్రణాళికలను గురించి జీవిత భాగస్వామితో చర్చిస్తారు. మీరు దేనిని నమ్ముతారో ఆ విషయమై ఇతరులతో ధైర్యంగా మాట్లాడండి. బంధువుల ఆకస్మిక రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు. ప్రతి పని చేతిదాకా వచ్చి వెనక్కి పోవడం వలన ఆందోళన పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.