శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (09:16 IST)

17-02-2019 దినఫలాలు - ఓర్పు, పట్టుదలతో శ్రమించి...

మేషం : భాగస్వామిక చర్చల్లో కొత్త ప్రతిపాదనలు చోటు చేసుకుంటాయి. అందరితో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. స్త్రీలు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది.
 
వృషభం : నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు చికాకులు తప్పవు. మీ కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులు విశ్రాంతిని పొందుతారు. ఖర్చులు అధికంగా ఉన్న మీ అవసరాలు నెరవేరుతాయి.
 
మిథునం : రావలసిన ధనం చేతికందుతుంది. ఇతరులకు వాహనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. ప్రేమ వ్యవహారాల పట్ల ఆసక్తి కనబర్చటం వల్ల ఒత్తిడి, మందలింపులు ఎదుర్కొనక తప్పదు. బంధువు మధ్య అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. దంపతుల మధ్య చిన్న చిన్న కలహాలు చోటు చేసుకుంటాయి.
 
కర్కాటకం : ఉద్యోగస్తులు అధికారుల మెప్పుకోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కుంటారు. పాత మిత్రుల కలయిక మీలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రైవేటు సంస్థలలో వారు అధికారులతో సంభాషించేటప్పుడు ఆత్మనిగ్రహం వహించవలసి ఉంటుంది. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకోండి.
 
సింహం : ఆర్థికస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. మీ బలహీనతలు, అలవాట్లు ఇబ్బంది కలిగించవచ్చు. స్త్రీలు వస్తువులు కొనుగోలు చేస్తారు.
 
కన్య : వస్త్ర, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు సంతృప్తి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. హోటల్, తినుబండారాలు, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారులకు పురోభివృద్ధి.
 
తుల : దంపతుల మధ్య చిన్న చిన్న కలహాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తులు ఓర్పు, కార్యదీక్షతో పనిచేయవలసి ఉంటుంది. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి చికాకులు తప్పవు. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. ఖర్చులు అధికంగా ఉన్న మీ అవసరాలు నెరవేరుతాయి.
 
వృశ్చికం : రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిసాయి. స్థిరాస్థి అమ్మకంకపై ఒత్తిడి వల్ల ఆందోళనకు గురవుతారు. మీ ఆగ్రవేశాలు అదుపులో ఉంచుకోవటం మంచిది.
 
ధనస్సు : ఆర్థిక విషయాల్లో ఊహించని మార్పు కనిపిస్తుంది. స్నేహ బృందాలు అధికం అవుతాయి. కాంట్రాక్టుర్లకు పనివారితో సమస్యలు తప్పవు. దూర ప్రయాణాలలో ఏకాగ్రత చాలా అవసరం. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి పనిభారం అధికం అవుతుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది.
 
మకరం : వివాహ యత్నాల్లో సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. పాత మిత్రుల కలయికతో మీలో నూతన ఉత్సాహం కానవస్తుంది. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. కీలకమైన వ్యవహారాలలో మెళకువ వహిస్తారు.
 
కుంభం : ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. నిరుద్యోగులు దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. స్త్రీలకు ఆర్థికపరమైన సమస్యలు అధికమవుతాయి. డబ్బు పోయినా కొన్ని సమస్యల నుంచి బయట పడతారు.
 
మీనం : స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రత్సాహం లభిస్తుంది. అకాల భోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ఖర్చులు అధికమైనా ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యమైన విషయాలను గురించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది.