సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Updated : ఆదివారం, 17 జూన్ 2018 (09:06 IST)

17-06-2018 -ఆదివారం మీ రాశి ఫలితాలు.. మనశ్శాంతి లోపిస్తుంది..

మేషం: ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురైనా మనశ్శాంతి లోపిస్తుంది. వైద్య రంగాలలోని వారికి పురోభివృద్ధి. మీ సిఫార్సుతో ఒకరికి చక్కని అవకాశం లభిస్తుంది. ప్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది.

మేషం: ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురైనా మనశ్శాంతి లోపిస్తుంది. వైద్య రంగాలలోని వారికి పురోభివృద్ధి. మీ సిఫార్సుతో ఒకరికి చక్కని అవకాశం లభిస్తుంది. ప్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. కళలు, క్రీడల వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. 
 
వృషభం: బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులతో మెళకువ అవసరం. మీ ఉత్సాహాని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. వృత్తి వ్యాపారాల్లో పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. ఎప్పటి సమస్యలను అప్పుడు పరిష్కరించుకోవడం శ్రేయస్కరం. కోర్టుల వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడుతాయి.
 
మిధునం: శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ప్రేమికులకు మధ్య పెద్దల వల్ల సమస్యలు తలెత్తగలవు. పన్నులు, రుణ వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. ప్రభుత్వ కార్యాయాల్లో పనులు అనుకూలిస్తాయి. సంగీత, సాహిత్య సదస్సులలో పాల్గొంటారు. 
 
కర్కాటకం: బ్యాంకింగ్ రంగాలవారికి పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. బంగారు వ్యాపారులకు అనుకోని సమస్యలు ఎదురవుతాయి. రవాణా రంగాలవారికి చికాకులు తప్పవు. విదేశాల నుంచి ఊహించని అవకాశాలు లభిస్తాయి. కొన్ని పాత వ్యవహారాలు చక్కబడతాయి. రచయితలకు, పత్రికా రంగంలో వారికి కీర్తి, గౌరవాలు పెరుగుతాయి.
 
సింహం: ఉద్యోగస్తులు తరచు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఎప్పటి నుండో వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభమవుతాయి. హామీలకు సంబంధించిన విషయాలలో పునరాలోచన అవసరం. కుటుంబ వ్యక్తులతో స్వల్ప విరోధములు రావచ్చు. అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి.
 
కన్య: భాగస్వామిక చర్చలలో కొత్త విషయాలు చోటుచేసుకుంటాయి. విద్యార్ధినులు పట్టుదలతో శ్రమించిన సత్ఫలితాలు సాధించగలరు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. పత్రికా సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. స్త్రీ మూలకంగా కలహాలు, ఇతరత్ర చికాకులు ఎదురవుతాయి. 
 
తుల: ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, సముచిత హోదా, కోరుకున్న చోటుకు బదిలీ వంటి శుభఫలితాలున్నాయి. భార్యా, భర్తల మధ్య అవగాహన లేక చికాకులు వంటివి ఎదుర్కుంటారు. విద్యా సంస్థలకు, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. ప్రేమ విషయంలో కానీ, వృత్తిపరంగా కానీ ఓ త్యాగం చేయాల్సి వస్తుంది. 
 
వృశ్చికం: దైవ దర్శనాలు, మెుక్కుబడులు అనుకూలిస్తాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. వృత్తుల వారికి నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. ముఖ్యుల గురించి ధనం వెచ్చిస్తారు. 
 
ధనస్సు: విదేశీయానాలకై చేయు యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. పీచు, ఫోం, లెదర్, వ్యాపారులకు పురోభివృద్ధి. కుటుంబీకులు, ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రతి పనీ ఉత్సాహంగా పూర్తిచేస్తారు. మిత్రుల సహాయంతో ఒక సమస్యను సునాయసంగా పరిష్కరిస్తారు.
 
మకరం: బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. సోదరీ సోదరులతో విభేదాలు తప్పవు. ఉద్యోగస్తులు తరుచు యూనియన్ కార్యకలాపాలు, సమావేశాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు హాడావుడి. తొందరపాటు తగదు. స్త్రీల ఉద్యోగ యత్నం ఫలిస్తుంది. వృత్తిపరంగా ప్రముఖులను కలుసుకుంటారు. 
 
కుంభం: ఆర్థిక, పెట్టుబడుల గురించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. స్త్రీలకు ఆహారం, ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. ఖర్చులు అధికమవ్వడం వల్ల ధనం పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరదు. సంఘంలో గౌరవం పొందుతారు. ఉద్యోగస్తులు యూనియన్ కార్యకలాపాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. 
 
మీనం: శాస్త్ర, సాంకేతిక రంగాలవారికి సదవకాశాలు లభిస్తాయి. ప్రింటింగ్ రంగాలవారు అచ్చుతప్పు పడుటవలన మాటపడవలసివస్తుంది. మీ అభిప్రాయం సున్నితంగా వ్యక్తం చేయటం శ్రేయస్కరం. గృహమునకు కావలసిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రైవేటు సంస్థలలోని వారికి సంతృప్తి కానవచ్చును.