మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శనివారం, 18 మే 2019 (12:16 IST)

18-05-2019 శనివారం దినఫలాలు - వేంకటేశ్వరుని ఆరాధించిన సర్వదా శుభం

మేషం : దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. తలచిన పనులలో కొంత అడ్డంకులు ఎదురైనా పట్టుదలతో పూర్తిచేస్తారు. ప్రైవేటు సంస్థల్లో వారికి యాజమాన్యం నుంచి ఇబ్బందులు తప్పవు. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. దూర ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు. 
 
వృషభం : బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో జాగ్రత్త అవసరం. ఉపాధ్యాయులు మార్పులకై చేయు యత్నాలు ఫలిస్తాయి. యాధృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వడం మంచిదికాదని గమనించండి. విలాసాల కోసం ధనం వ్యయం చేస్తారు. 
 
మిథునం : కళా, క్రీడా రంగాల్లో వారికి ప్రోత్సాహం లభిస్తుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఇతరులకు ధనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. స్త్రీలతో మితంగా సంభాషించడం క్షేమదాయకం కాదు. పోస్టల్, కొరియర్ రంగాలవారికి పనిభారం అధికమవుతుంది. 
 
కర్కాటకం : చిరు వ్యాపారులకు, చిన్నతరహా వ్యాపారులకు పురోభివృద్ధి. ముఖ్యులలో ఒకరి గురించి అప్రియమైన వార్తలు వింటారు. బంధువులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక, సేవా విషయాలపై దృష్టిసారిస్తారు. శ్రీవారు, శ్రీమతి ఆరోగ్యం పట్ల శ్రద్ధచూపిస్తారు. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. 
 
సింహం : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. ఆపరేషన్ల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. స్త్రీల మనోభావాలకు, తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. భాగస్వామిక చర్చలు వాయిదాపడుట మంచిదని గ్రహించండి. కోర్టు, ఆస్తి వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
కన్య : ఉద్యోగస్తులు వాహనం, ఇతర విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. శ్రమాధిక్యత, మానసిక ఆందోళన వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధిపథకాల్లో నిలదొక్కుకుంటారు. 
 
తుల : మీ కళత్ర వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధువుల నిష్టూరాలు, పట్టింపులు ఎదుర్కోవలసి వస్తుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాలు వాయిదా వేయడం మంచిది. పత్రిక సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం.
 
వృశ్చికం : స్త్రీలు ఓర్పు పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ఉమ్మడి వ్యవహారాలలో ఆశించినంత పురోగతి ఉండదు. నూతన ప్రదేశ సందర్శనల వల్ల నూతన ఉత్సాహం కానరాదు. కాంట్రాక్టర్లకు, ఇంజనీరింగ్ శాఖాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఆలయ సందర్శనాల కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. 
 
ధనస్సు : మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ఇంటికి అవసరమైన వస్తుసామాగ్రి సమకూర్చుకుంటారు. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి, ఇతరుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి, ఇతరుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. 
 
మకరం : ప్రైవేటు కంపెనీలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. దంపతుల ఆలోచనలు విరుద్ధంగా ఉంటాయి. ఏ విషయంలోనూ ఒంటెత్తుపోకడ మంచిదికాదు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అవసరం. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సంతానం విషయంలో సంజాయిషీలు ఇచ్చుకోవలసి వస్తుంది. 
 
కుంభం : స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతం కూడదు. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు కలహాలు చోటుచేసుకుంటాయి. బంధువుల ఆకస్మిక రాకతో ఒకింత ఇబ్బందులను ఎదుర్కొంటారు. గతితప్పిదాలు పునరావృతమయ్యే సూచనలున్నాయి. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. 
 
మీనం : రుణ విముక్తులవుతారు. నూతన పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. వృత్తులవారికి గుర్తింపుతోపాటు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగం చేయువారు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. గృహిణీలకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు.