శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : శనివారం, 8 జూన్ 2019 (05:20 IST)

08-06-2019 మీ రాశిఫలాలు : విదేశాల్లోని ఆత్మీయులు...

మేషం : ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారాలు తెలుసుకుంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటంతో నిరుత్సాహానికి గురవుతారు. బ్యాంకింగ్ రంగాల వారికి మెళకువ అవసరం. ఉన్నతాధికారులకు తనిఖీలు, పర్యవేక్షణలలో ఏకాగ్రత ముఖ్యం.
 
వృషభం : ఉద్యోగస్తులు కొంత బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తారు. రాజకీయ నాయకులు తరచు సభ, సమావేశాలలో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యం, వాహన యోగం పొందుతారు. ప్రతి విషయంలోను మితంగా వ్యవహరించండి. వ్యవసాయ, తోటల రంగాల వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి.
 
మిథునం : కుటుంబ అవసరాలకు, మీ సంతానం కోసం ఫీజులు, బిల్లులు చెల్లిస్తారు. అప్రయత్నంగా కొన్ని వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులు కొంత బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తారు. ఖర్చులు చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి.
 
కర్కాటకం : ఉమ్మడి ఆర్ధిక లావాదేవీల్లో మాటపడాల్సి రావచ్చు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ఏ విషయంలోను ఎదుటివారిని అతిగా విశ్వసించటం అంత మంచిది కాదు. పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. మీ మాటతీరు, పద్దతులు ఇబ్బందులకు గురిచేస్తాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సమస్యలు తప్పవు.
 
సింహం : ఆర్ధికంగా బాగున్నా మానసిక ప్రశాంతత అంతగా ఉండదు. ట్రాన్స్‌పోర్టు, ఆటో మొబైల్, మెకానికల్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. మిత్రులను కలుసుకుంటారు. స్త్రీలు ఊహించని ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల వల్ల మందలింపులు తప్పవు.
 
కన్య : సోదరీ, సోదరుల మధ్య తగాదాలు రావచ్చు. కంప్యూటర్ రంగంలోని వారికి అభివృద్ధి కానవస్తుంది. అంత పరిచయం లేని వ్యక్తులతో మితంగా వ్యవహరించండి. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. బంధువుల రాక వలన గృహంలో సందడి నెలకొంటుంది. పాల బాకీలు చెల్లిస్తారు.
 
తుల : వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. సాహసించి మీరు తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలనిస్తుంది. మీ కళత్రవైఖరి మీకు చికాకును కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఏమంతగా వృద్ధి కనిపించకపోవచ్చు.
 
వృశ్చికం : వృత్తిపరమైన బాధ్యతల కారణంగా భాగస్వామికి ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకోలేకపోతారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.
 
ధనస్సు : మీ సంతానం విషయంలో సంతృప్తి కానరాగలదు. పుణ్య కార్యాల్లో నిమగ్నులవుతారు. ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో సంతృప్తి కానవస్తుంది. మొండి బకాయిలు వసూలు కాగలవు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవడం మంచిది. చేపట్టిన పనిలో స్వల్ప ఆటంకాలను ఎదుర్కుంటారు.
 
మకరం : విద్యార్థులకు దూర ప్రదేశాలలో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. మీ ఉన్నతిని చాటుకోవటం కోసం ధనం విరివిగా వ్యయం చేయటం మంచిదికాదని గమనించండి. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. బ్యాంకింగ్ రంగాల వారికి పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. ఉద్యోగస్తులు ఓర్పు, కార్యదీక్షతో పనిచేయవలసి ఉంటుంది.
 
కుంభం : సంఘంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం మీ ఉన్నతికి సహకరిస్తాయి. వ్యాపారాభివృద్ధికి కొత్త ప్రణాళికలు, పథకాలు స్ఫురిస్తాయి. రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
 
మీనం : ఆర్థికంగా బాగున్నా మానసిక ప్రశాంతత అంతగా ఉండదు. సోదరీ, సోదరుల మద్య తగాదాలు రావచ్చు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. ఆకస్మికంగా ప్రయాణాలు సంభవిస్తాయి. ఆస్తి వ్యవహారాల్లో దాయాదులతో జాగ్రత్తగా వ్యవహరించండి.