గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 నవంబరు 2022 (18:49 IST)

ప్రదోష కాలంలో మహాశివుడి పూజ...

Lord shiva
ప్రదోష కాలంలో పూజ ఉత్తమమైనది. ప్రదోష కాలానికి ముందుగా  స్నానం చేసి శివారాధన చేయాలి. ప్రదోష కాలంలో శంకరుడు అమ్మవారితో కలిసి ఆనంద తాండవం చేస్తాడు. 
 
ఆ సమయంలో దేవతలందరూ ఆ నాట్యం చూసేందుకు కైలాయంలో వుంటారు. ఆ సమయంలో స్వామి ఆనంద తాండవం చేస్తున్న దివ్యమంగళ నటరాజ రూపాన్ని కొలిస్తే.. సర్వపాపాలూ హరిస్తాయి. 
 
మహాశివుడు అభిషేక ప్రియుడు కనుక మంత్రోక్తంగా పంచామృతాలతో ఆయనను అభిషేకించాలి.  ప్రదోష సమయంలో ఈశ్వరుడిని పూజించిన వారికి గ్రహదోషాలు వుండవు. పాపాలు హరించుకుపోతాయి. 
 
ప్రదోష కాలం లో చేసే పూజాపునస్కారాలు దానధర్మాలు మామూలు సమయం లో చేసే వాటికంటే అధిక శుభఫలితాలనిస్తాయి, అలాగే ఈ సమయం లో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలనిస్తాయి. శని త్రయోదశి ప్రదోషసమయాన శివుడికి అభిషేకం చేయడం చాల విశేషంగా లభిస్తుంది.
 
నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడం, ముఖ్యంగా శనిత్రయోదశి అంటే శని ప్రదోషం రోజున ఉపవాసం ఉండడం, రావిచెట్టుకి ప్రదక్షిణాలు చేసి ఆవనూనెతో దీపం పెట్టడం, నువ్వుల నూనెలో ముఖం చూసుకొని ఆ నూనెని దానం చేయడం. 
 
నల్ల కాకికి అన్నం పెట్టడం, నల్ల కుక్కకి అన్నం పెట్టడం, నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్తువులు, నవధాన్యాలు, ఇనుము దానం చేయడం వంటివి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.