బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Modified: శుక్రవారం, 29 డిశెంబరు 2017 (21:27 IST)

ధనుస్సు రాశి ఫలితాలు 2018లో ఇలా వున్నాయ్....

మూల 1, 2, 3,4 పాదాలు, (యే, యో, బా, బి), పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు (భూ, ధ, భా, ఢ) 1వ పాదం (భే) ఆదాయం 5, వ్యయం 5, పూజ్యత 1, అవమానం 5. ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా జన్మము మీద శని, ఈ సంవత్సరం అంతా ధనస్థానము నందు కేతువు, అష్టమ స్థానము నందు రాహువు, అక్ట

మూల 1, 2, 3,4 పాదాలు, (యే, యో, బా, బి), పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు (భూ, ధ, భా, ఢ) 1వ పాదం (భే)
ఆదాయం 5, వ్యయం 5, పూజ్యత 1, అవమానం 5.
 
ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా జన్మము మీద శని, ఈ సంవత్సరం అంతా ధనస్థానము నందు కేతువు, అష్టమ స్థానము నందు రాహువు, అక్టోబరు 11వ తేదీ వరకు లాభము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా వ్యయము నందు సంచరిస్తాడు.
 
ఈ సంవత్సరం మీ గోచారం పరిశీలించగా, "క్షమా శస్త్రం కరే యస్య" అన్నట్లుగా క్షమా గుణం, దయ, మంచితనంతో కష్టాలను అధిగమిస్తారు. ఏలినాటి శని రెండో భాగం మరియు అష్టమ రాహు ప్రభావం చేత కొంచెం చికాకులు ఎక్కువనే చెప్పొచ్చు. కొంత గురు బలం ఉన్నందువల్ల అక్టోబరు వరకు సామాన్యంగా ఉండగలదు. కుటుంబ సమస్యలు దాటుకుంటూ ముందుకు నడుస్తారు. ప్రతి పనిలో భాగస్వామిక సలహా, సహకారం లభిస్తుంది. ముఖ్యుల సలహా, సహకారం కూడా పొందుతారు. ఏలినాటి శని జన్మంలో ఉన్నందువల్ల శారీరక తేజస్సు తగ్గిపోవడం, గుండెకు సంబంధించిన చికాకులు, మానసిక ఆందోళన, ప్రతి పనిలో ఆటంకాలు వంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది. 
 
పట్టుదలతో యత్నాలు సాగించండి. బంధుమిత్రుల వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. ఆర్థిక విషయాల్లో ఆదాయం కంటే వ్యయం అధికంగానే ఉంటుంది. అక్టోబరు నుండి ఆర్థిక ఇబ్బంది మరింత పెరిగే అవకాశం ఉంది. బంధు మిత్రులతో విరోధములు ఏర్పడకుండా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అందువల్ల తలపెట్టిన పనిలో శ్రద్ధ, జాగ్రత్త, ఏకాగ్రత అవసరమని గమనించండి. దూరప్రాంత ప్రయాణాలు ఒంటరిగా చేయకుండా ఉండటం మంచిది. అవివాహితుల్లో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. రాజకీయాల్లో వారు మార్పులు, చేర్పులకే చేయు యత్నాలు ఫలిస్తాయి. మంచి పేరు, ఖ్యాతి పొందుతారు. 
 
ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొనండంతో పాటు ప్రతి పని వాయిదా పడుతుంది. ఫ్యాన్సీ, స్టేషనరీ రంగాల్లో వారికి అనుకూలంగా ఉండగలదు. నిరుద్యోగులకు శ్రమాధిక్యత తప్ప అనుకున్న ప్రతిఫలం పొందలేరు. వృత్తి వ్యాపారులకు బహు జాగ్రత్తలు అవసరం. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రవాణా రంగాల్లో వారు అధిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న బాకీలు వసూలు కాగలవు. అయితే, గురుబలం ఎక్కువగా ఉన్న కారణంగా నష్టాల రాకుండా కాలక్షేపం చేస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త, మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. 
 
ఆడిటర్లు, వైద్య రంగాల్లో వారు క్షణం తీరుబడిలేకుండా గడుపుతారు. విదేశీయాన యత్నాల్లో సఫలీకృతులవుతారు. రైతులు అతికష్టంమీద సానుకూల ఫలితాలు పొందగలరు. నూతన వ్యాపారాల పట్ల ఆకర్షితులవుతారు. అయితే, ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. విందులు, వినోదాల్లో మితంగా ఉండాలి. మీ అత్యుత్సాహాన్ని అదుపు చేసుకోండి. కోర్టు వ్యవహారాల్లో ఏ మాత్రం తొందరపాటుతనం పనికిరాదు. రుణ విమోచనకై చేయుయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు ఇతర విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. షేర్ వ్యాపారులకు శ్రమ ఉన్నప్పటికీ లాభాలు పొందగలుగుతారు. 
 
ఈ రాశివారు హనుమంతుని తమలపాకులతో పూజించడం వల్ల దోషాలు నివారించబడతాయి. మూల నక్షత్రం వారు 9 సార్లు, పూర్వాషాఢ నక్షత్రం వారు 20 సార్లు, ఉత్తరాషాఢ నక్షత్రం వారు 9 సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేసి తెల్లని పూలతో శనిని పూజించిన దోషాలు తొలగిపోతాయి. 
 
మూల నక్షత్రం వారు కృష్ణవైఢ్యూర్యం, పూర్వాషాఢ వారు వజ్రం, ఉత్తరాషాఢ వారు పుచ్చుకెంపు ధరించిన శుభం కలుగుతుంది. 
 
మూల నక్షత్రం వారు వేగి చెట్టును, పూర్వాషాఢ నక్షత్రం వారు నిమ్మ, ఉత్తరాషాఢ నక్షత్రం వారు పనస చెట్టును ఖాళీ ప్రదేశాల్లో గానీ, దేవాలయాల్లో గానీ, విద్యా సంస్థల్లో గానీ నాటిన శుభం, జయం, పురోభివృద్ధి కలుగుతాయి.